థియేట‌ర్ల‌కు క‌దిలి రండి అంటూ కియ‌రా ప్ర‌చారం

Update: 2020-12-10 13:30 GMT
కోవిడ్ మ‌హ‌మ్మారీ పంచ్ థియేట‌ర్ బిజినెస్ పై ఒకే రేంజులోనే ప‌డింది. ఇన్నాళ్లు థియేట‌ర్ సిండికేట్ దురాక్ర‌మ‌ణ‌! అంటూ విరుచుకుప‌డిన చోటా మోటా నిర్మాత‌లంద‌రికీ ఇక ఆరోప‌ణ‌ల‌కు తావు లేకుండా అయిపోయింది. దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమ‌తించేసినా రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసినా ఇంకా జ‌నం నుంచి భ‌యాలు తొల‌గిపోయిన‌ట్టు లేదు.

థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు యువ‌త‌రం సాహ‌సిస్తున్నా ఏజ్డ్ ప‌ర్స‌న్స్ వ‌చ్చేందుకు అంత‌గా డేర్ చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో మ‌ల్టీప్లెక్సుల‌కు యువ‌త‌రం క‌దిలి రావ‌డం ఆశావ‌హ ధృక్ప‌థాన్ని పెంచుతోంది.

హాలీవుడ్ మూవీ టెనెట్ విజ‌య‌వంత‌మైంది. నోలాన్ సినిమా వీక్షించేందుకు అభిమానులు థియేట‌ర్ల‌కు క‌దిలి రావ‌డంతో మ‌ల్టీప్లెక్సుల్లో సంద‌డి క‌నిపించింది. ఇక ఈ క్రైసిస్ అనంత‌రం రిలీజ్ కాబోతున్న క్రేజీ మూవీగా సాయి తేజ్ `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్` వ‌స్తోంది. ఈ మూవీకి ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌నే భావిస్తున్నారు. థియేట‌ర్ల‌కు జ‌నాల్ని ర‌ప్పించేందుకు సాయి తేజ్ ప్రచారంతో ప్ర‌య‌త్నిస్తున్నారు.

మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా సెల‌బ్రిటీలు థియేట‌ర్ల‌కు క‌దిలి వ‌స్తూ అంతో ఇంతో ప్ర‌చారానికి పూనుకోవ‌డం విశేషం. తాజాగా బిజీయెస్ట్ హీరోయిన్ కియ‌రా అద్వాణీ థియేట‌ర్ కి వ‌చ్చి త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేసింది. ముంబైలోని ఓ మ‌ల్టీప్లెక్స్ కి వ‌చ్చిన కియ‌రా ఇదిగో ఇలా ప్ర‌చారం చేస్తోంది. కోవిడ్ నియ‌మ‌నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌గం సీట్లకు `నాట్ టు బి ఆక్యుపైడ్` అంటూ బోర్డులు త‌గిలించారు. వాటిలో కూచునేందుకు అనుమ‌తించ‌రు. అలాగే టిక్కెట్లు అమ్మ‌రు. జాగ్ర‌త్త‌లు తీసుకుని థియేట‌ర్ల‌కు వ‌స్తే స‌మ‌స్యేమీ ఉండ‌ద‌ని చెప్పేందుకే ఈ ప్ర‌య‌త్నం. మ‌రి కియ‌రా మాట విని జ‌నం క‌దిలొస్తారా లేదా? అన్న‌ది వేచి చూడాలి.
Tags:    

Similar News