బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీద ఉంది కియరా అద్వాణీ. ఇటీవలే కార్తీక్ ఆర్యన్ తో కలిసి `భూల్ భులయా 2` లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన ఈ బ్యూటీ ఆ వెంటనే ధావన్ బోయ్ తో కలిసి జగ్ జగ్ జీయో తో మరో హిట్టు కొట్టింది. ఈ సినిమా ఇటీవలే విడుదలై సంతృప్తికర వసూళ్లను సాధిస్తోంది. ప్రస్తుతం జగ్ జగ్ జీయో ప్రమోషన్స్ లో కియారా అద్వానీ బిజీ గా ఉంది. మీడియా వేదికలపై చాలా ఆసక్తికర సంగతుల్ని చెబుతోంది.
తాజా ఇంటర్వ్యూలో తన కోసం ఒక వ్యక్తి చేసిన అత్యంత క్రేజీ పనిని కియరా వెల్లడించింది. అయితే అతను సిద్ధార్థ్ మల్హోత్రా కాదు... ఇంకొకరు. అతడు ఎవరు? అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఇటీవలి కాలంలో వృత్తిపరమైన విజయాలతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం కారణంగా కియారా అద్వాని నిరంతర వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇప్పటివరకు సిద్ధార్థ్ కాకుండా కియరా కలుసుకున్న అత్యంత క్రేజీ పర్సనాలిటీ ఎవరు? అన్నది ఆరా తీస్తే ఆసక్తికర విషయం తెలిసింది.
తాజా ఇంటర్వ్యూలో కియారా అద్వానీ తన కోసం ఒక వ్యక్తి చేసిన అత్యంత క్రేజీ థింగ్ ని వెల్లడించమని యాంకర్ అడిగారు. తనను కలవడానికి ఒక వ్యక్తి భారీ ఆకాశహార్మ్యాన్ని మెట్ల మీదుగా ఎక్కాడని కియరా తెలిపింది. తన భవనం మెట్లు ఎక్కిన అభిమాని సాహసం గురించి దాచుకోలేకపోయింది.
తాను పై అంతస్తులో ఉంటున్నానని కానీ ఆ అభిమాని దేనినీ లెక్క చేయక తన కోసం అన్ని మెట్లు ఎక్కుతూ వచ్చాడని వెల్లడించింది. తనని కలిసినప్పుడు అతనికి బాగా చెమటలు పట్టాయి. నిజానికి అతడిని అలా చూస్తే భయం కలిగింది. దీనిని వెర్రి లేదా భయానక సంఘటన అని కియరా అంది.
ఒక వ్యక్తి నా కోసం చేసిన వెర్రి పని ఇది.. నిజంగా అతడు నా అభిమాని. నేను ఏ అంతస్తులో ఉంటానో చెప్పను కానీ చాలా ఎత్తైన అంతస్తులో నివసిస్తున్నాను. అతను నన్ను కలిసేందుకు నా భవనంలోని అన్ని మెట్లు ఎక్కాడు. తను వచ్చినప్పుడు నాక్కూడా బాగా చెమటలు పట్టాయి. నాకు ఇంకా గుర్తుంది. ``ఏమైంది? మీరు బాగున్నారా? కూర్చుంటారా? మీకు మంచి నీళ్లు కావాలా?`` అని అడిగాను. అతను అంత సాహసం చేసింది దేనికి? అంటే.. నేనంటే ఎంత ఇష్టమో ఆ సమయంలో చూపించాలనుకున్నాడు.. అని తెలిపింది. కియారా తన అభిమాని చేసిన పని ఎంతో స్వీట్ అనిపించినా కానీ చెమటలతో తడిసి భయానకంగా ఉన్నందున ఇకపై తన ఇంటికి రావొద్దని వారించింది.
కియారా అద్వానీ ప్రాజెక్ట్ ల విషయానికి వస్తే.. తదుపరి గోవింద నామ్ మేరా సెట్స్ లో ఉంది. ఇందులో ఆమె విక్కీ కౌశల్ తో కలిసి స్క్రీన్ ను పంచుకుంటోంది. అలాగే శంకర్- రామ్ చరణ్ లతో RC15 కూడా చిత్రీకరణలో ఉంది.