ఫోటో స్టొరీ: నాటీ పోజిచ్చిన హాట్ బ్యూటీ

Update: 2019-08-05 08:58 GMT
బాలీవుడ్ హీరోయిన్లలో ఎంతో మంది బ్యూటీలు ఉన్నారు కానీ వారందరిలో కియారా అద్వానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది.  అదేంటంటే ఒక స్టార్ హీరోయిన్ కు కావాల్సిన అన్నీ  లక్షణాలు పుష్కలంగా ఉండడం.  పాత్రకు తగ్గట్టు ఒదిగిపోవడం.. గ్లామర్.. బోల్డ్ నెస్.. పీఆర్ స్కిల్స్.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం.. ఇవన్నీ ఉన్నాయి. అందుకే తారాపథంలో రివ్వున పైపైకి దూసుకుపోతోంది.

కియారా సోషల్ మీడియాలో ఏదైనా ఫోటో పోస్ట్ చేసిందంటే చాలు.  లక్షల్లో లైకులు.. వేలల్లో కామెంట్స్ వస్తాయి.  రీసెంట్ గా కియారా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటోలో కియారా పర్పుల్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ లో చిటికెన వేలుతో గోర్లు కొరుకుతున్నట్టుగా ఒక నాటీ పోజిచ్చింది.   డీప్ వీ నెక్ డ్రెస్ తో అందాలు ధారపోస్తూనే ఫోటోకు పోజివ్వడంతో నెటిజన్లకు మత్తెక్కించేలా ఉంది.  యాక్సెసరీస్ విషయానికి వస్తే కుడి చేతి వేలికి ఒక రకమైన ఉంగరం.. ఎడమ చేతికి మరో రకమైన ఉంగరం ధరించింది.  ఓవరాల్ గా ఈ పోజు అభిమానులనే కాదు.. వ్యతిరేక-అభిమానులను  కూడా మెప్పించేలా ఉంది.

ఈ ఫోటోల సంగతి సరే.. కియారా కెరీర్ ఎలా ఉంది? 'కబీర్ సింగ్' బ్లాక్ బస్టర్ కావడంతో కియారా క్రేజ్ డబల్ అయింది. ప్రస్తుతం కియారా చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు  ఉన్నాయి.  'గుడ్ న్యూస్'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' ప్రస్తుతం ఆమె లిస్టులో ఉన్న సినిమాలు.  దీన్ని బట్టే కియారా జోష్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.


Tags:    

Similar News