కబీర్ సింగ్ సక్సెస్ తో కియరాని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది ఈ అమ్మడు. కెరీర్ ప్రారంభించిన చాలా తక్కువ కాలంలో నేము ఫేము వచ్చేయడంతో అమ్మడిని పట్టుకోవడం అంత ఈజీగా లేదు. ఓవైపు టాలీవుడ్ స్టార్లు రామ్ చరణ్.. మహేష్ .. పవన్ లాంటి వాళ్లు వలలు వేస్తున్నా అస్సలు చిక్కడం లేదట.
అయితే అంత బిజీగా ఉందా? అంటే ఇదిగో ఇక్కడ కియరా హడావుడి చూస్తేనే అర్థమైపోతోంది. ఈరోజు నెట్ ఫ్లిక్స్ సిరీస్ గిల్టీ ప్రమోషన్స్ కి కియరా బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో విచ్చేసింది. ముంబైలో జరిగిన ఈ వేడుకలో కియరా లుక్ ప్రధాన ఆకర్షణగా మారింది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన గిల్టీ సిరీస్ లో అకాంక్ష రంజన్ కపూర్ సహా కియరా కీలక పాత్ర పోషించింది. దీంతో ప్రమోషన్ వేదికకు కియారా బోల్డ్ లుక్ తో ఎటెండైంది. క్లాసిక్ బ్లాక్ డ్రెస్ లో సింపుల్ గా ఉన్నా.. స్టైలిష్ ఫోజులతో వేడెక్కించింది.
ప్రస్తుతం ఈ బ్లాక్ చిక్ లుక్ యువతరంలో వైరల్ గా షేర్ అవుతోంది. ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ పరంగానూ కియరా తన స్థాయిని ఆవిష్కరిస్తోంది. వెబ్ సిరీస్ కెరీర్ పరిశీలిస్తే కరణ్ నిర్మించిన లస్ట్ స్టోరీస్ లో కియరా వేడెక్కించే పాత్రలో నటించింది. దానికి ప్రశంసలు దక్కాయి. తాజాగా గిల్టీలో అంతకుమించిన బోల్డ్ థ్రిల్లింగ్ రోల్ తో మైమరిపించనుందని అర్థమవుతోంది. అత్యాచారం నేపథ్యంలో థ్రిల్లర్ సిరీస్ ఇది. మార్చి 6 నుంచి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో టెలీకాస్ట్ కానుంది.