కాక‌లు పుట్టిస్తున్న కియ‌రా

Update: 2019-07-31 14:11 GMT
అందాల కియ‌రా స్పీడ్ గురించి చెప్పేదేముంది?  ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ లో న‌వ‌త‌రానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. నిరంత‌రం  ఏ కొత్త ఫ్యాష‌న్ వ‌చ్చినా కియ‌రాను ఫాలో అవ్వాల్సిందే. రెగ్యుల‌ర్ గా ర‌క‌ర‌కాల ఫోటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాని హీటెక్కిస్తున్న కియ‌రా మోడ్ర‌న్ గాళ్స్ కి రోల్ మోడ‌ల్ గా మారింది. టాలీవుడ్ బాలీవుడ్ అనే భేధం లేకుండా అన్నిచోట్లా త‌న‌కు వీరాభిమానులున్నారు. అందుకే కియ‌రా ఏం చేసినా అదో సెన్సేష‌న్ గా మారుతోంది. దానికి ప్ర‌చారం హోరెత్తిపోతోంది.

కియ‌రా తాజాగా హ‌లో మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం ఇచ్చిన ఫోజు ప్ర‌స్తుతం జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోలో కియ‌రా స్ట‌న్నింగ్ లుక్ మైమ‌రిపిస్తోంది. హ‌లో ఇండియా ఆగ‌స్టు క‌వ‌ర్ పేజీ కోసం బాలీవుడ్ టాప్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా ఎంతో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని కియ‌రా కోసం ఈ డిజైన్ ని రూపొందించారు. ఆయ‌న ఖాతాలో ఇలాంటి డిజైన‌ర్ సౌంద‌ర్యాన్ని ఎప్పుడూ చూసి ఉండ‌రు మ‌రి. అంత ఇదిగా కియ‌రా ఒదిగిపోయి ఆ డ్రెస్ లో క‌నిపిస్తోంది. బ్లాక్ స్ట్రాప్ లెస్ టాప్ .. బ్లాక్ బాట‌మ్ .. కాంబినేష‌న్ గా క్రిస్ట‌ల్ నెక్.. అబ్బ‌బ్బో కియ‌రాని ఇలా చూడాలంటే రెండు క‌ళ్లు స‌రిపోవు. యూత్ చూపు ప‌క్క‌కు తిప్పుకోవ‌డం అంత ఈజీ కాదు.

ప్ర‌స్తుతం ఈ క‌వ‌ర్ షూట్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. కియ‌రా ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ప‌లు క్రేజీ సినిమాల‌కు సంత‌కం చేసింది. సౌత్ లోనూ కొన్ని స్క్రిప్టులు విన్నాన‌ని ఇదివ‌ర‌కూ వెల్ల‌డించింది. అయితే ఇటువైపు తిరిగి రాక ఎప్పుడు అన్న‌ది మాత్రం చెప్ప‌లేదు.


Tags:    

Similar News