ధోనీ మూవీతో దేశం మొత్తం జనాలకు బాగానే దగ్గరైంది కియారా అద్వానీ. అయితే.. మహేష్ మూవీలో నటించిన తర్వాత వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. భరత్ అనే నేను చిత్రంలో సూపర్ స్టార్ కి జోడీగా నటించడం.. ఆ సినిమా మహేష్ కెరీర్ బెస్ట్ కావడంతో.. ఈ భామ బాగానే సంబరాల్లో ఉంది.
పైగా మహేష్ మూవీ సెట్స్ పై ఉండగానే.. మరో స్టార్ హీరోతో అవకాశం కూడా వచ్చింది. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో కియారా హీరోయిన్ గా నటిస్తోందనే విషయం తెలిసిందే. రంగస్థలం తర్వాత చెర్రీ చేస్తున్న పిక్చర్ కావడంతో.. ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఇది కూడా హిట్టయిందంటే ఇక టాలీవుడ్ లో కియారా జోరుకు బ్రేక్ వేయడం కష్టం అనే సంగతి ఒప్పుకోవాలి. సేమ్ డిట్టో.. ఈ బాలీవుడ్ భామ కూడా అదే ఆలోచనలో ఉంది. కొంతకాలంగా చెర్రీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. హీరో తన ఫ్యామిలీతో యూరోప్ టూర్ వెళ్లగానే.. తను కూడా విదేశాల్లో చక్కర్లు కొట్టడం స్టార్ట్ చేసింది.
ప్రస్తుతం కాలిఫోర్నియా.. హాలీవుడ్ లో ఉంది కియారా అద్వానీ. వెస్ట్ హాలీవుడ్ స్టూడియోను సందరిస్తున్న ఈ భామ.. వెనుక గ్రద్ద రెక్కలు విప్పార్చుకుని ఉన్న ప్రదేశంలో నుంచుని.. ముందు ఆ ఈగిల్ తల కనిపించే ప్రాంతంలో తానే అడ్డు నుంచి ఇచ్చిన పోజ్ సూపర్బ్ గా సెట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ కలర్స్.. అమ్మడి డ్రెసింగ్ ప్లస్ స్కిన్ టోన్ మ్యాచ్ కావడం చూస్తే.. ఈ భామ కోసం హాలీవుడ్ లో ఆ డిజైన్ వేశారా అనిపించక మానదు. తాను కూడా త్వరలో ఇలాగే ఎగిరిపోతానని కియారా చెబుతున్నట్లుగా ఉంది ఈ ఫోటో.