దాన్ని భద్రంగా ఉంచుకుంటా..

Update: 2018-07-15 05:54 GMT
ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. తమ అభిరుచులు అనుగుణంగా జీవిస్తుంటారు. ప్రస్తుత వర్ధమాన హీరోయిన్లు కూడా తమ అందాన్ని కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా చర్మం - కేశాల కోసం వారు తీసుకునే శ్రద్ధ అంతా ఇంతకాదు.. తాజాగా తన గ్లామర్ సీక్రెట్స్ ను బయటపెట్టింది ‘భరత్ అనే నేను’లో నటించిన హీరోయిన్ కియారా అడ్వాణీ.. ప్రస్తుతం ఈమె బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాంచరణ్ సరసన సినిమాలో నటిస్తోంది.

కియారా మాట్లాడుతూ.. ‘ఒక్కొక్క హీరోయిన్ కు ఒక్కో అలవాటు ఉంటుంది. నాకు చర్మ సౌందర్యం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను. అందుకోసం కొన్ని అలవాట్లు వదులుకోను’ అని పేర్కొంది. ‘చాలా మంది జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.. చర్మానికి కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం ఏదో ఒకటి రాసుకుంటూ ఉండాలి. దుమ్ము, ధూళి పేరుకుపోకుండా చూసుకోవాలి. చాలా మంది మేకప్ తో నిద్రపోతుంటారు. షూటింగ్ నుంచి వచ్చాక ఎంత ఆలస్యమైనా సరే మేకప్ తీసేశాకే నాకు నిద్రపడుతుంది. తినడం మరిచిపోతానేమో కానీ.. చర్మాన్ని శుభ్రం చేసుకోవడంలో మాత్రం రాజీపడను.. ఆయా సీజన్ల బట్టి మాయిశ్చరైజర్స్ ను తప్పకుండా వాడతాను. చంటిపిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. చర్మం విషయంలోనూ అంతే భద్రంగా ఉండాలి’ అంటూ తన గ్లామర్ ను ఎలా కాపాడుకుంటానో వెల్లడించింది.
Tags:    

Similar News