ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న క్రేజీ హీరోయిన్లలో కియారా అద్వాని ఒకరు. నటన.. గ్లామర్.. బోల్డ్ నెస్.. యూత్ లో క్రేజ్.. అన్నీ ఉన్న భామ కియరా. రీసెంట్ గా ఈ హాట్ బ్యూటీ వూట్ వారి 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్ సీజన్ 2' కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
తనకు భారీగా గుర్తింపు తీసుకొచ్చిన లస్ట్ సీరీస్ గురించి మాట్లాడుతూ ఆ సీరీస్ నిర్మాత కరణ్ జోహార్ తనను ఆడిషన్ చేయకుండానే సెలెక్ట్ చేశాడని చెప్పింది. కరణ్ నటులను సులభంగా గుర్తిస్తాడని చెప్పింది. సంచలనం సృష్టించిన 'వైబ్రేటర్' సీన్ గురించి మాట్లాడుతూ "ఆ సీన్ కు ముందు కరణ్ దాన్నో జోక్ లాగ చేయవద్దు. ఎలా ఉందో అలా చెయ్. ఫన్నీ సీనే కానీ ఫన్నీగా చేయవద్దు అంటూ సూచించాడు" అని చెప్పుకొచ్చింది.
ఇక తన పేరు గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని వెల్లడించింది. అసలు తన పేరు కియరా కాదట. అలియా అద్వాని అట. అయితే సల్మాన్ ఖాన్ తన పేరును మార్చుకోమని సూచించాడట. ఆల్రెడీ అలియా భట్ పేరుతో ఒక నటి ఉంది.. ఇండస్ట్రీ లో ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్లు ఉండడం కుదరదని చెప్పాడట. అయితే 'కియారా' పేరును సల్మాన్ సూచించలేదట.. తనే ఎంపిక చేసుకుందని తెలిపింది. ఇప్పుడు అమ్మనాన్నలు కూడా కియారా అనే పేరుతో పిలుస్తున్నారని చెప్పింది. కియారా ప్రస్తుతం 'కబీర్ సింగ్'.. 'గుడ్ న్యూస్'.. 'షేర్షా'.. 'లక్ష్మీ బాంబ్' చిత్రాల్లో నటిస్తోంది.