పెళ్లికి ముందు ప్రేమ.. డేటింగ్ అనేది చాలా కామన్ అయ్యింది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు డేటింగ్.. ప్రేమ.. సహజీవనం.. ఆ తర్వాత పెళ్లి అంటున్నారు. ప్రస్తుతం ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ డేటింగ్ లో.. ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. తాజాగా కియారా అద్వానీ మాట్లాడుతూ తాను ప్రేమలో లేనంటూ చెప్పింది. ప్రస్తుతం తాను ఎవరితో కూడా రిలేషన్ షిప్ మెయింటెన్ చేయడం లేదు అంది.
ఒకసారి ఎవరితో అయినా రిలేషన్ షిప్ పెట్టుకుంటే వారితో జీవితాంతం కలిసి ఉండాలని.. అలా జీవితాంతం కలిసి ఉంటామని అనుకున్నప్పుడు మాత్రమే రిలేషన్ షిప్ మొదలు పెట్టాలనేది తన ఉద్దేశ్యం అంటూ చెప్పుకొచ్చింది. ఎవరిని అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామో.. ఎవరితో అయితే జీవితాంతం ఉండాలనుకుంటున్నామో వారితో డేటింగ్ తప్పేమి కాదని.. పెళ్లికి ముందు కలిసి తిరగడంలో తప్పేం లేదని చెప్పుకొచ్చింది.
పెళ్లి వరకు వెళ్తామన్నప్పుడు ముందుగానే అడ్వాన్స్ అవ్వడంలో తప్పు లేదని అంటున్న కియారా అద్వానీ తాను మాత్రం ప్రస్తుతానికి సింగిల్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా సినిమాలపైనే ఉందన్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో చాలా బిజీ హీరోయిన్ గా ఉంది. వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో ఈ అమ్మడు భరత్ అనే నేను.. వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే.