వీడియో: కియ‌రా స్టంట్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

Update: 2021-06-15 14:30 GMT
సాధార‌ణంగా హీరోయిన్లు జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తూ ఫిట్ నెస్ ని కాపాడుకుంటుంటారు. కేవ‌లం  ఎంపిక చేసుకున్న పాత్ర కోసం అవ‌స‌రం మేర జిమ్ చేసి రూపురేఖ‌ల్ని మార్చుకుంటారు. కానీ ఇటీవ‌ల క‌థానాయిక‌ల తీరు మారింది. దిశా ప‌టానీ.. ఏకంగా ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ స్ఫూర్తితో కిక్ బాక్సింగ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకుంది. ఇప్పుడు కియారా అద్వాణీ అదే బాట‌లో కిక్ లు పంచ్ లు ప్రాక్టీస్ చేస్తోంది. మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ లోనూ శిక్ష‌ణ పొందుతోంది. ఈ భామ సాహ‌సాలు  ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తున్నాయి.

ఇదిగో ఇక్క‌డిలా  మార్ష‌ల్ విద్య‌లు ప్ర‌ద‌ర్శిస్తూ నెటిజ‌నుల‌ను ఆక‌ట్టుకుంది. ఎదురుగా నుంచొని ఉన్న ట్రైన‌ర్ త‌ల పై ఉన్న హ్యాట్ ని అలా కాలు గాల్లో లేపి త‌న్నేసిన తీరు షాక్ కి గురి చేస్తోంది. కియ‌రాలో స్టామినాకి ఇది నిద‌ర్శ‌నం. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. అయితే ఈ వీడియో ఇప్ప‌టిది కాదు. ఏడాదిన్నర త‌రవాత ఇలా.. అత‌డి న‌మ్మ‌కానికి హ్యాట్సాఫ్ అంటూ కియ‌రా వ్యాఖ్య‌ను జోడించింది.

కియారా కెరీర్ విష‌యానికి వస్తే ప్ర‌స్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. తెలుగులో మొద‌టి సినిమా భ‌ర‌త్ అనే నేను మంచి విజయం సాధించిన‌ప్ప‌టికీ ఆశించిన అవ‌కాశాలు రాలేదు. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న విన‌య విధేయ రామ‌లో న‌టించినా ఫ‌లితం లేక‌పోయింది. అయితే అప్ క‌మింగ్  ఎన్టీఆర్- కొర‌టాల ప్రాజెక్ట్ లో కియారా పేరు వినిపిస్తోంది.

Full View
Tags:    

Similar News