కియారా అద్వాణీ బాలీవుడ్ లో యమా బిజీగా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో ఒకటి 'భూల్ భాలైయ్యా-2' మంచి విజయం అందుకుంది. మరో సినిమా 'జగ్ జగ్ జియో' యావరేజ్ గా ఆడింది. ఇంకా అమ్మడు లై్ లో పెట్టిన సినిమాలెన్నో ఉన్నాయి. ఇదే వేగంలో ఇటీవలే అశోతోష్ గోవారికర్ తో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రానికి కమిట్ అయింది.
'కర్రమ్ కుర్రమ్' టైటిల్ తో ఆ చిత్రాన్నితెరకెక్కించడానికి సర్వం సిద్దం అవుతోంది. అయితే ఇంతలోనే సదరు డైరెకటర్కి కియారా ఊహించని షాక్ ఇచ్చిందిట. అమ్మడు సినిమా నుంచి తప్పుకుటున్నట్లు సమాచారం. కమర్శియల్ గా సినిమా వర్కౌట్ అవ్వదని..సినిమాలో తన పాత్రకి అంత ప్రాముఖ్యత లేదని.. పైగా ఆపాత్రకు తాను సరిపడను అని చెప్పి కియారా ఎగ్జిట్ అయినట్లు తెలుస్తుంది.
ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా యూనిట్ త్వరలోనే రివీల్ చేయనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే కియారా తెరపైకి తెస్తున్న అసలు కారణం ఇదేనా? ఇంకేదైనా ఉందా?అన్నది మరో సందేహంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో చాలా సినిమాలున్నాయి. ఊపిరి సలపనంత బిజీ కనిపిస్తుంది.
హిందీ సినిమాలతో పాటు.. తెలుగులో పాన్ ఇండియా చిత్రం ఆర్సీ 15 లో నటిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమాని అమ్మడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ సినిమా కోసం ఎలాంటి సమయంలోనైనా అందుబాటులో ఉంటానని...తానో డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమా షూట్ ఇంకా పూర్తికాలేదు.
చరణ్..కియారాలపై సన్నిశాలు చిత్రీకరించాల్సి ఉంది. అలాగే బాలీవుడ్ లో కొన్ని కమిట్ మెంట్లు పూర్తిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కియారా డేట్లు సర్దుబాటు చేయలేక ఇలా ఎగ్జిట్ అయినట్లు వినిపిస్తుంది. మరి అసలు సంగతేంటి? అన్నది తెలియాలి. కియారాకి తెలుగులో కొత్త అవకాశాలు బాగానే వస్తున్నాయి. యంగ్ హీరోలు నుంచి సీనియర్ స్టార్స్ వరకూ అంతా అమ్మడితో రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.