ఈగ విలన్ కి మరి కొన్నాళ్లు బెడ్ రెస్ట్!!

Update: 2016-07-06 05:06 GMT
ఈగ మూవీతో టాలీవుడ్ లో అరంగేట్రంలోనే సూపర్ విలన్ ఇమేజ్ సంపాదించేసుకున్నాడు కిచ్చా సుదీప్. కన్నడలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నా.. మంచి కేరక్టర్ అయితే ఏ భాష అయినా ఎలాంటి రోల్ అయినా చేసేస్తూ ఉంటాడీ హీరో. అలాగే వర్క్ విషయంలో మహా స్పీడ్. ఎన్నిరకాల హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చినా సినిమా షూటింగులు చేయడం సుదీప్ కి బాగా అలవాటు. అదే ఇప్పుడు ఇతని హెల్త్ పై ప్రభావం చూపింది. రీసెంట్ గా హెబ్బులి మూవీ షూటింగ్ సమయంలో గాస్ట్రిక్ అటాక్ కారణంగా.. హాస్పిటల్ కు తరలించాల్సి వచ్చింది.

'వరుసగా షెడ్యూల్స్ - కంటిన్యూగా వర్క్ చేయడంతో ఆరోగ్యంపై ప్రభావం పడింది. కొంత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియాకి - అభిమానులకు ధన్యవాదాలు' సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుదీప్.. మూడు రోజుల రెస్ట్ అనంతరం మరో ట్వీట్ వేశాడు. 'నాకోసం నా ఆరోగ్యంగా వరుసగా ట్వీట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. మరికొంత రెస్ట్ అవసరం అంతే. ఆరోగ్యం బాగవగానే అంటే త్వరలోనే కెమేరా ముందుకు వచ్చేస్తా అంటూ మరో ట్వీట్ చేశాడు సుదీప్.

గతంలో కూడా మైగ్రేన్ వంటి కొన్ని సమస్యలతో కూడా ఇబ్బంది పడ్డాడు సుదీప్. దీనింతటికీ సరైన రెస్ట్ తీసుకోకుండా వరుసగా షూటింగులు చేయడమే అని తెలిసినా.. మరోసారి ఇదే సమస్యను కొని తెచ్చుకున్నాడు. వర్క్ పై తప్ప హెల్త్ పై దృష్టి పెట్టడనే విమర్శలున్నా.. పట్టించుకోకపోవడం సుదీప్ స్టైల్.
Tags:    

Similar News