కిమ్ శర్మ. బాలీవుడ్ లో ఉండే హాటు సుందరాంగులలో కిమ్ కూడా ఒకరు. ఆమె 19 ఏళ్ళ క్రితమే సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్ గా స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయస్తురాలే. ఎందుకంటే.. కృష్ణ వంశీ 'ఖడ్గం' సినిమాలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద అనే ప్రత్యేక గీతంలో ఆడిపాడి అందరినీ ఆకట్టుకుంది. ఇవన్నీ సరే గానీ ఇప్పుడు అసలు టాపిక్ ఆమె ప్రొఫెషన్ కాదు. పర్సనల్ లైఫ్.
గత కొంతకాలంగా ఈ భామ టాలీవుడ్ కమ్ బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణేతో ఎఫైర్ సాగిస్తోంది. ఇద్దరూ కలిసి మెలిసి తిరగడంతో ఇక నెక్స్ట్ స్టెప్ పెళ్ళే అని అనుకున్నారు. కానీ ప్రేమ ముదిరి పాకాన పడేలోపే విడిపోయారు. నెల రోజుల నుండి ఇద్దరూ సింగిల్ గా కనిపిస్తూ ఉండడంతో ఇద్దరూ విడిపోయారని మొదట వార్తలు వచ్చాయి. హర్షవర్ధన్ పబ్లిసిస్ట్ బ్రేకప్ నిజమేనని నిర్థారించడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. గతంలో లాగా బ్రేకప్ అయితే బాధ పడుతూ చీకటిగదిలో కూర్చునే రోజులు కావివి. అందుకే లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతూ కిమ్ ఇన్స్టాగ్రామ్ ను హీటెక్కిస్తోంది.
వరసగా స్టైలిష్ ఫోటోలు పోస్ట్ చేస్తూ సింగిల్ స్టేటస్ ను మళ్ళీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పకనే చెప్తోంది. నాలుగు రోజుల క్రితం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసి "బెస్ట్ టైమ్ విత్ బేబీస్" అనే క్యాప్షన్ ఇచ్చింది. తాజాగా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. వైట్ కలర్ బికినీలో కళ్ళకు గాగుల్స్ ధరించి తన చేతిని ముందుకు చాపి విరగబడి నవ్వుతోంది. ఈ ఫోటోకు "నాతో పాటు వచ్చేయండి" అనే క్యాప్షన్ ఇచ్చింది. బికినీలో భామ అందాలు నెటిజనులను మాయ చేస్తున్నాయి. బికినీలో రెండు బటర్ ఫ్లై బొమ్మలు కూడా ఉన్నాయి .. ఆ డిజైన్ అయితే అదిరిపోయింది. ఈ హాటు బ్యూటీకి మరింత సెక్సీనెస్ ను తీసుకొచ్చింది మాత్రం ఆమె నాభికి ధరించిన ఆభరణం. ఎంత మోడరన్ కాకపోతే ఇలా పోజిస్తుంది చెప్పండి? కిమ్ బికినీ పోజు.. క్యాప్షన్.. తత్త్వం బోధపడింది కదా. పాప సింగిల్.. షీ ఈజ్ రెడీ టూ మింగిల్..!