పిక్ టాక్‌ః 'ఖడ్గం' వచ్చి 20 ఏళ్లయినా అవే అందాలు

Update: 2021-03-20 02:58 GMT
కృష్ణవంశీ దర్శకత్వంలో దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఖడ్గం సినిమాలో ముసుగు వేయొద్దు మనసు మీద అంటూ అప్పట్లో యూత్‌ ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ కిమ్‌ శర్మ. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ అమ్మడు ఇప్పటికి అదే అందంతో అభిమానులను సోషల్‌ మీడియా ఫాలోవర్స్ ను అలరిస్తుంది. 41 ఏళ్ల వయసులో కూడా కిమ్ శర్మ చేస్తున్న అందాల ప్రదర్శణకు అంతా కూడా మంత్ర ముగ్దులు అవుతున్నారు. తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటో మళ్లీ ఒకసారి ఆమెను మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా చేసింది.

పాతికేళ్ల వయసు ఉన్న హీరోయిన్స్‌ కూడా టూ పీస్ బికినీ వేసేందుకు ఆసక్తి చూపించరు. కాని కిమ్ శర్మ తన 41 ఏళ్ల వయసులో ఇలా బికినీ వేసిందంటే ఆమె ఫిజిక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు పదుల వయసు దాటలేదు అంటే నిజమే అనుకునేలా ఆమె ఫిజిక్‌ మరియు బ్యూటీ ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ టూ పీస్ బికినీలో మెరిసి పోతున్న కిమ్‌ శర్మ మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని అభిమానులు ఆశ పడుతున్నారు. బుల్లి తెర వెండి తెరపై మెరుస్తున్న కిమ్‌ శర్మ ఈమద్య కేవలం సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే వెండి తెరపై ఈమె అందాలను చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు.
Tags:    

Similar News