కింగ్ మిడిల్ క్లాస్ యాడ్ కూల్ గా ఉందే

Update: 2018-12-17 15:41 GMT
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో జోరుగా బ్రాండ్ ప్రమోషన్స్ చేసే వారిలో అక్కినేని నాగార్జున పేరు చెప్పుకోవాలి.  ఇప్పటికే కళ్యాణ్ జ్యూయలర్స్.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తదితర బ్రాండ్స్ కు అంబాజిడర్ గా వ్యవహరిస్తున్న నాగార్జున తాజాగా స్టార్ గ్రూప్ టీవీ చానల్స్ యాడ్ లో కనిపించాడు. నాగార్జున పార్టనర్ గా ఉండే మాటీవీ గ్రూప్ ను స్టార్ టీవీ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే స్టార్ గ్రూప్ యాడ్ లో నాగార్జున నటించాడు.

ఒక పల్లెటూరి నుండి వచ్చిన మధ్యతరగతి వ్యక్తిలాగా నాగార్జున కనిపిస్తే కమెడియన్ వెన్నెల కిషోర్ స్టార్ నెట్వర్క్ ప్యాక్ తీసుకుంటే ఎంత తక్కువ ఖర్చు అవుతుందో దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నాగార్జునకు వివరించే షాప్ ఓనర్ గా నటించాడు.  స్టార్ నెట్వర్క్ గ్రూప్ కు సంబంధించిన ఛానల్స్ సబ్ స్క్రిప్షన్ తో లాభం ఉందని చెప్తూ 'కూల్ కదా' అంటాడు వెన్నెల కిషోర్.  నిజమే.. అటు పల్లెటూరి యాసలో మాట్లాడే నాగార్జున.. ఇటు కూల్ కదా అనే వెన్నెల భయ్యా ఇద్దరూ కూల్ గా ఉన్నారు.

ఎప్పుడూ మన్మధుడి లా కనిపించే నాగార్జున గడ్డంలో కాస్త తేడాగా ఉన్నాడు గానీ నాగార్జున ఎక్స్  ప్రెషన్స్.. యాడ్ కాన్సెప్ట్ మాత్రం సింప్లీ సుపర్బ్.  నాగార్జున - వెన్నెల కిషోర్ కాంబినేషన్ కూడా సూపర్ గా వర్క్ అవుట్ ఉంది. 

Watch Here :https://www.youtube.com/watch?v=aOHCBUIZKpA




Full View
Tags:    

Similar News