మెగా ఫ్యామిలీ హీరోగా చిరంజీవి చిన్నల్లుడు గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కళ్యాన్ దేవ్ కెరీర్ కష్టాల్లో పడ్డట్లయ్యింది. వరుసగా ప్లాప్ లు పడటం తో పాటు శ్రీజతో విభేదాలు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ హీరోగా కొనసాగడం అనుమానం అన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఆయన ఇప్పటికే నటించిన కిన్నెరసాని సినిమా విడుదల విషయం లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కిన్నెరసాని సినిమా విడుదల కోసం ఇప్పటికే పలు డేట్లు మార్చారు. విభిన్నమైన కథ అంటూ చాలా కొత్త గా కనిపిస్తానంటూ కళ్యాణ్ దేవ్ పదే పదే చెబుతున్నా కూడా సినిమాను పట్టించుకున్న నాథుడే లేడు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆ మధ్య విడుదల చేయడం కోసం డేట్లు కూడా ఖరారు చేయడం జరిగింది. కాని అనూహ్యంగా వాయిదా వేస్తున్నట్లుగా స్వయంగా మేకర్స్ ప్రకటించారు.
థియేటర్ రిలీజ్ కు అస్సలు పరిస్థితులు అనుకూలించడం లేదట. అంటే ఏ ఒక్కరు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదట. అందుకే సినిమా ను ఓటీటీ కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు పవన్ కు ఆప్తుడిగా పేరున్న రామ్ తాళ్లూరి నిర్మించాడు. ఆయన గట్టిగా థియేటర్ రిలీజ్ కు ప్రయత్నించినా కూడా అస్సలు బయ్యర్లు ముందుకు రాకపోవడం తో ఓటీటీకి ఇచ్చేస్తున్నారట.
జీ5 ఓటీటీ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈనెల 10వ తారీకున జీ 5 లో కిన్నెర సాని స్ట్రీమింగ్ అధికారిక ప్రకటన వచ్చింది. పెద్ద బడ్జెట్ సినిమాలకు.. క్రేజీ మూవీస్ కు కూడా జనాలు థియేటర్లకు రావడం లేదు. ఈ సమయంలో కిన్నెర సాని సినిమా ను సాహసం చేసి విడుదల చేసినా కూడా ఈ పరిస్థితుల్లో సినిమాకు జనాలు రావడం కష్టంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల విడుదల ఎక్కువ సినిమా లు యావరేజ్ టాక్ దక్కించుకున్నా కూడా వసూళ్ల విషయంలో బయ్యర్లకు ఎగ్జిబిటర్లకు నష్టాలను మిగిల్చాయి. అందుకే కిన్నెరసాని సినిమా ఓటీటీకి వెళ్లాల్సి వచ్చిందట. మొత్తానికి థియేటర్ రిలీజ్ కోసం ఎదురు చూసిన కళ్యాణ్ దేవి కిన్నెర సాని పాపం.. చివరకు ఓటీటీ లో దిగాల్సి వచ్చింది.