కళ్యాణ్ దేవ్ హీరోగా ఆన్ శీతల్ హీరోయిన్ గా రమణ తేజ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కిన్నెరసాని'. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మొన్నటి వరకు థియేటర్ రిలీజ్ అనుకున్న కిన్నెరసాని కాస్త ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది.
జీ 5 వారు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఈనెల 10వ తారీకున స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్.. టీజర్ మరియు పాటలు సినిమా పై ఆసక్తి పెంచాయి. ఒక విభిన్నమైన నేపథ్యంలో కొత్త తరహా కథతో ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ ను చూస్తే అనిపిస్తుంది.
కళ్యాణ్ దేవ్ తో పాటు సినిమాలోని పాత్రలన్నీ కూడా చాలా విభిన్నంగా కనిపిస్తున్నాయి. ఆ పాత్రలు కూడా వివిధ కాలాలకు సంబంధించినవిగా అనిపిస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్ చూసిన తర్వాత కిన్నెరసాని లో ఏదో ప్రత్యేకమైన విషయం ఉందని అనిపిస్తుంది. సినిమా మొత్తం కూడా కిన్నెరసాని అనే పుస్తకం చుట్టు తిరగబోతున్నట్లుగా ట్రైలర్ లో చెప్పకనే చెప్పారు.
గతంతో పోల్చితే కళ్యాణ్ దేవ్ ఈ సినిమా లో విభిన్నమైన లుక్ లో కనిపించడంతో పాటు నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ట్రైలర్ తో ఆసక్తిని అయితే పెంచగలిగారు. రామ్ తాళ్లూరి మంచి అభిరుచి ఉన్న నిర్మాత. గతంలో ఈయన మంచి సినిమాలను నిర్మించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక మంచి సినిమాను ఆయన నిర్మించినట్లుగా ఉన్నాడు అనిపిస్తుంది.
ఇటీవల విడుదల అయిన సూపర్ మచ్చి సినిమా నిరాశ పర్చడంతో కళ్యాణ్ దేవ్ నటించిన కిన్నెరసాని సినిమా పై ఇప్పటి వరకు ఆసక్తి కాని అంచనాలు కాని లేవు. కాని ట్రైలర్ విడుదల తర్వాత కిన్నెరసాని పై చాలా మంది లో ఆసక్తి కనిపిస్తోంది. జీ5 కి ఇదో మంచి సినిమా గా నిలవడం ఖాయం అని.. తెలుగు ప్రేక్షకులు ఎక్కువ శాతం మంది స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Full View