టాలీవుడ్ మార్కెట్ స్థాయి పెరిగిపోవడంతో కొత్త తరహా చిత్రాలొస్తున్నాయి. అంతుకు తగ్గట్టే యంగ్ హీరోలు కూడా లైమ్ లైట్ లోకి వచ్చేస్తున్నారు. కొత్త తరహా కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మునుపెన్నడూ లేనంతగా వరుస ఆఫర్లతో షాకిస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో యంగ్ హీరో `సైలెంట్ స్టార్`గా పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం వరుస క్రేజీ చిత్రాల లైనప్ తో షాకిస్తున్నాడు.
మనోడి లైనప్ చూస్తే అంతా షాక్ కు గురి కావాల్సిందే. వివరాల్లోకి వెళితే.. కిరణ్ అబ్బవరం ఎలాంటి సినిమా నేపథ్యంలేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అతను నటించిన తొలి చిత్రం `రాజా వారు రాణిగారు`. ఈ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ రాయలసీమ కుర్రోడు తొలి చిత్రంతోనే మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత చేసిన `ఎస్.ఆర్ కల్యాణ్ మండపం` మ్యూజికల్ గా ఎంత పాపులర్ అయింతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆ మధ్య విడుదలైన ఈ మూవీ కిరణ్ అబ్బవరంకు మంచి విజయాన్ని అందించడమే కాకుండా మంచి టేస్ట్ వున్న హీరోగా గుర్తింపుని తెచ్చిపెట్టింది. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సాయి కుమార్ తండ్రి పాత్రలో నటించారు. కిరణ్ అబ్బవరం, సాయి కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచారు. ఈ మూవీ ఇచ్చిన జోష్ తో కిరణ్ అబ్బవరం మొత్తం పది సినిమాలు కమిట్ కావడం పలువురు యంగ్ హీరోలని షాక్ కు గురిచేస్తోంది.
సమ్మతమే, సెబాస్టియన్, `వినరో భాగ్యము విష్ణు కథ` చిత్రాలతో పాటు మైత్రీ మూవీమేకర్స్ , కోడిరామకృష్ణ కూతురు నిర్మించబోయే మూవీ, దిల్ రాజు సినిమా, సితార వారితో సినిమా..ఏషియన్ వారితో సినిమాజ.. ఇలా దాదాపు పది చిత్రాలని లైన్ లో పెట్టాడు కిరణ్ అబ్బవరం. ఇందులో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న`వినరో భాగ్యము విష్ణు కథ` కూడా వుంది. ఈ లైనప్ చూసిన వారంతా ఈ స్థాయిలో క్రేజీ బ్యానర్ లలో వరుసగా సినిమాలు చేసిన హీరో ఎవరూ లేరని, ఆ విషయంలో కిరణ్ అబ్బవరం రికార్డు సాధించినట్టే నని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.
అంతే కాకుండా ఈ క్రేజీ బ్యానర్ లలో కిరణ్ అబ్బవరం చేస్తున్న పది చిత్రాల్లో ఏ మూడు సినిమాలు హిట్టయినా మనోడి దశ తిరిగి పోతుందని, కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలో కొత్త స్టార్ గా మారడం ఖాయమని చెబుతున్నారు. నిజమే అతని లైనప్ చూసిన యంగ్ హీరోలే షాకవుతూ ఇదే లైనప్ నాయనా అని చర్చించుకుంటున్నారట.