ఆ పార్టీకి నాలుగవ వంతు వచ్చేసింది

Update: 2018-03-17 13:09 GMT
ఓ వారం పాటు సమ్మె.. మూడు వారాల నుంచి సరైన సినిమా లేని సిట్యుయేషన్.. గతవారం వచ్చిన సినిమాలన్నీ నిరుత్సాహపరిచిన వైనం.. ఇలాంటి పరిస్థితిలో యంగ్ హీరో నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ థియేటర్లలోకి వచ్చింది. సినిమా వచ్చింది అనే కంటే.. పరిస్థితులను క్యాష్ చేసుకుంటూ.. అందరినీ మెప్పించే కంటెంట్ తో మాంచి కలెక్షన్స్ ను వసూలు చేయగలిగింది.

కిర్రాక్ పార్టీ తొలి రోజు కలెక్షన్స్ నిఖిల్ సిద్ధార్ధ్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచాయి. సీడెడ్ ఏరియాలో వసూళ్లు కాస్త తక్కువగా ఉన్నా.. తొలి రోజున కిర్రాక్ పార్టీకి భారీ వసూళ్లే దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం.. 1.70 కోట్ల వరకూ కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో నిఖిల్ బెస్ట్ ఎక్కడకి పోతావు చిన్నవాడా.. తొలి రోజున 1.25 కోట్లను కలెక్ట్ చేయగా.. ఇప్పుడు ఆ ఫిగర్ ను పెద్ద మార్జిన్ తోనే క్రాస్ చేసింది కిర్రాక్ పార్టీ. యూఎస్ లో కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లే దక్కాయి. 55 లక్షల వరకూ షేర్ వసూలు కాగా.. మొత్తం తొలి రోజు షేర్ వసూళ్లు 2.4 కోట్లుగా నమోదయ్యాయి.

కిర్రాక్ పార్టీని ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ ను విక్రయించారు. తొలి రోజునే 4వ వంతు రాబట్టేయడం.. వీకెండ్స్ లో ఇరగదీసేసేందుకు పుష్కలంగా అవకాశాలు ఉండడంతో.. నిఖిల్ మూవీ సాలిడ్ హిట్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ జనాలు అంటున్నారు. మరే సినిమా నుంచి సరైన పోటీ లేకపోవడంతో వీకెండ్ తర్వాత కూడా కిర్రాక్ పార్టీ స్టడీగానే ఉండొచ్చని అంచనా.
Tags:    

Similar News