'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేదికపై కిశోర్ తిరుమల మాట్లాడుతూ .. "ఒకప్పుడు ఒక వైపున యాక్షన్ సినిమాలు .. మరో వైపున మాస్ సినిమాలు .. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ .. ఫ్యామిలీ మూవీస్ .. ఇలా రకరకాల వేరియేషన్స్ లో వచ్చాయి. అన్ని రకాల సినిమాలకు ఆదరణ లభిస్తూ ఉండేది.
కోవిడ్ తరువాత యాక్షన్ సినిమాలు .. లవ్ స్టోరీస్ వచ్చాయి గానీ, నాకు తెలిసి ఫ్యామిలీ స్టోరీస్ మాత్రం రాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్ కి వచ్చి అంతా కలిసి ఎంజాయ్ చేసే వాతావరణాన్ని టోటల్ గా మనం మిస్సయ్యాం.
ఇంతకాలంగా మనం ఏదైతే మిస్సయ్యాం అనిపిస్తుందో .. అది ఈ సినిమా మీకు హండ్రెడ్ పెర్సెంట్ ఇస్తుందని నేను హామీ ఇస్తున్నాను. థియేటర్లన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ తో కళకళలాడుతూ ఉండటాన్ని చూడాలనేది నా కోరిక. ఈ సినిమా డెఫినెట్ గా నా కలను నిజం చేస్తుందని నమ్ముతున్నాను.
మొన్న నేను పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లాను. అక్కడ 14 .. 15 ఫ్యామిలీస్ పూజ చేయించుకుంటున్నారు. గోత్ర నామాలు చెప్పేటప్పుడు నేను విన్నాను. అక్కడున్న లేడీస్ లో 18 మంది తమ పేరు చెబితే, అందులో 11 పేర్లు ఈ సినిమాలోని పాత్రలకి ఉన్నాయి. అప్పుడు ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి తప్పకుండా కనెక్ట్ అవుతుందని అనిపించింది.
ఇది కేవలం లేడీస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఫ్యామిలీ ఓరియెండెట్ సినిమా మాత్రమే కాదు .. ఇది ఒక చక్కని లవ్ స్టోరీ కూడా. ఇంతకుముందు నేను చేసిన 'నేను శైలజ' .. 'చిత్రాలహరి' మాదిరిగానే యూత్ కోరుకునే అన్ని అంశాలు ఈ కథలో ఉన్నాయి. యూత్ లోని వాళ్లంతా కూడా తమను ఈ సినిమాలో చూసుకుంటారు. తప్పకుండా వాళ్లంతా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. సాధారణంగా నేను రియల్ లైఫ్ లో ఫీలైన అంశాలను తెరపై చూపించడానికి ఇష్టపడుతుంటాను. అలాంటి ఒక అనుభవంతోనే ఈ సినిమాలోని మదర్ .. డాటర్ రిలేషన్ షిప్ ను చూపించాను.
మదర్ .. డాటర్ గా ఈ సినిమాలో ఖుష్బూ - రష్మిక కనిపిస్తారు. వాళ్ల కాంబినేషన్లో వచ్చే నాలుగైదు సన్నివేశాలు మనసుకి వెంటనే కనెక్ట్ అవుతాయి. ఈ సీన్స్ వస్తున్నప్పుడు థియేటర్లలోని ఆడియన్స్ లో మదర్ వైపు డాటర్ .. డాటర్ వైపు మదర్ చూసుకుంటారు. అంతటి ఫీల్ ఉన్న సన్నివేశాలు అవి. ఒక మాస్ హీరో సినిమాకి ఫ్యాన్స్ ఎలాగైతే చప్పట్లు కొడతారో, అలా ఈ సినిమా ఇంటర్వెల్ కి లేడీస్ చప్పట్లు కొడతారు. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకూ మనకి దగ్గరవారిలో ఎవరో ఒకరిని గుర్తుకు చేస్తూనే ఉంటుంది. ఎవరూ ఎలాంటి పరిస్థితుల్లోను ఈ సినిమాను చూసే అవకాశాన్ని వదులుకోకండి" అని చెప్పుకొచ్చాడు.