టీం ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరు ఇద్దరు ప్రేమలో ఉన్న విషయం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నా ఇటీవలే వీరి ప్రేమ గురించిన క్లారిటీ వచ్చింది. ఇద్దరు కూడా ఔను తాము ప్రేమలో ఉన్నామంటూ క్లారిటీ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఒక వైపు క్రికెటర్ గా కేఎల్ రాహుల్ బిజీ బిజీగా ఉండగా.. హీరోయిన్ గా అతియా శెట్టి మెల్ల మెల్లగా స్టార్ గా మారుతోంది. నటిగా అతియా శెట్టి ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. కెరీర్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ తో ప్రేమలో పడటంతో ఆఫర్లు అంతగా రావడం లేదు అనే పుకార్లు కూడా బాలీవుడ్ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్నాయి.
ఆ విషయం పక్కన పెడితే వీరి పెళ్లికి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి అనే సమాచారం అందుతోంది. ఇటీవలే కేఎల్ రాహుల్ కుటుంబ సభ్యులు మరియు అతియా శెట్టి కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. మూడు నెలల్లో పెళ్లికి సంబంధించిన ఒక ముహూర్తం ను ఖరారు చేశారట. అతి త్వరలోనే ఆ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
పెళ్లిని ముంబయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కేఎల్ రాహుల్ మరియు అతియా శెట్టి కాపురం పెట్టేందుకు గాను ఇప్పటికే ఒక ఖరీదైన ఇల్లు కొనుగోలు చేయడం జరిగిందట.
పెళ్లికి సంబంధించిన పనులు అక్కడ నుండే జరుగుతున్నట్లుగా అతియా శెట్టి సన్నిహితుల నుండి తెలుస్తోంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ గాయం కారణంగా జర్మనీ లో ఉన్నాడు.
నెల రోజుల పాటు ఆయన పూర్తి విశ్రాంతి లో ఉండాలని వైద్యులు సూచించారట. దాంతో అతియా శెట్టి కూడా అక్కడే ఉండి రాహుల్ ఆరోగ్యం పట్ల శ్రద్దగా చూసుకుంటుందట. కేఎల్ రాహుల్ త్వరలో టీమ్ ఇండియా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతియా శెట్టితో ఆయన పెళ్లి విషయం పై మరింత ఆసక్తికర చర్చ జరుగుతోంది.