బిచ్చ‌గాడు.. లీల‌ హ‌త్యనే న‌మ్ముకున్నాడా?

Update: 2022-07-16 15:30 GMT
త‌మిళ హీరో విజ‌య్ అంటోని `బిచ్చ‌గాడు` చిత్రంతో త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. సైలెంట్ గా విడుద‌లైన ఈ మూవీ సంచ‌న విజ‌యాన్ని సాధించిన మేక‌ర్స్ కి రికార్డు స్థాయి లాభాల్ని అందించింది. అయితే ఈ మూవీ త‌రువాత విజ‌య్ ఆంటోని ఆస్థాయిలో స‌క్సెస్ ని సొంతం చేసుకోలేక‌పోయాడు. ఇప్ప‌టికీ సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకి రావాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తూనే వున్నాడు.

విజ‌య్ ఆంటోని న‌టిస్తున్న లేటెస్ట్ త‌మిళ్ మూవీ `కోల‌`. బాలీజీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని తెలుగులో `హ‌త్య‌` పేరుతో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇందులో హీరో విజ‌య్ హ‌త్య ర‌హ‌స్యాన్ని చేదించే డిటెక్టివ్ గా క‌నిపించ‌బోతున్నాడు. `ఖిలాడీ` ఫేమ్ మీనాక్షి చౌద‌రి ప్ర‌ధాన‌ పాత్ర‌లో న‌టించింది.

రితికా సింగ్ కీల‌క పాత్ర చేసింది. లోట‌స్ పిక్చ‌ర్స్ తో క‌లిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచ‌ర్స్ బ్యాన‌ర్స్ పై క‌మ‌ల్ బోరా, జి. ధ‌నుంజ‌య‌న్‌, ప్ర‌దీప్ బి, పంక‌జ్ బోరా, విక్ర‌మ్ కుమార్‌, తాన్ శ్రీ దొరైసింగ‌మ్ పిళ్లై, సిద్ధార్ధ్ శంక‌ర్‌, ఆర్వీ ఎస్ అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు.  

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా శ‌నివారం ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్ ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. లీల‌ని ఎవ‌రు హ‌త్య చేశార‌ని ఇన్వెస్టిగేటివ్ టీమ్ కొంత మందిని విచారిస్తున్న స‌న్నివేశాల‌ని మోష‌న్ పోస్ట‌ర్ లో చూపించారు. విచార‌ణ సంద‌ర్భంగా బాయ్ ఫ్రెండ్‌, ఫొటో గ్రాఫర్‌, మేనేజ‌ర్‌, ఏజెంట్‌, పొరుగు మ‌హిళ‌.. వీరిలో ఎవ‌రు లీల‌ని హ‌త్య చేశారు? వీరు కాకుండా మ‌రో వ్య‌క్తి కార‌ణంగానే లీల హ‌త్య‌కు గురైందా? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ సినిమా సాగుతున్న‌ట్టుగా తెలుస్తోంది.  

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో సాగ‌నున్నఈ సినిమాపై తాజాగా రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న ఈ మూవీని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు. గ‌త కొంత కాలంగా సూప‌ర్ హిట్ ని సొంతం చేసుక‌ని మ‌ళ్లీ ట్రాక్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న `బిచ్చ‌గాడు` హీరో విజ‌య్ ఆంటోని ఆశ‌ల్ని హ‌త్య సినిమా ఎంత వ‌ర‌కు నెర‌వేస్తుందో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

ఈ చిత్రంలోని ఇత‌ర‌ పాత్ర‌ల్లో ముర‌ళీ శ‌ర్మ‌, జాన్ విజ‌య్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, సిద్ధార్ధ్ శంక‌ర్‌, అర్జున్ చిదంబ‌రం, కిషోర్ కుమార్‌, సంకిత్ బోరా త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్ర‌పీ శివ‌కుమార్ విజ‌య‌న్‌, ఎడిటింగ్ ఆర్ కె సెల్వ‌, సంగీతం గిరీష్ గోపాల‌కృష్ణ‌న్.




Full View
Tags:    

Similar News