నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ''టక్ జగదీష్'' ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రీతూ వర్మ - ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'నిన్ను కోరి' 'మజిలీ' చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు 'ఇంకోసారి' పాట మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో సినిమా నుంచి 'కోలో కోలన్న కోలో' అనే సెకండ్ సాంగ్ ని తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
'కోలో కోలన్న కోలో.. కొమ్మలు కిలకిలా నవ్వాలి.. కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి' అంటూ సాగిన ఈ పాటకు థమన్ స్వరాలు సమకూర్చారు. దీనికి ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. కుటుంబ విలువలు.. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఆప్యాయతలు వంటి వాటిని ఇందులో ప్రస్తావించారు. ఈ గీతాన్ని అర్మాన్ మాలిక్ - హరిణి - శ్రీకృష్ణ - థమన్ కలిసి ఆలపించారు. మొత్తం మీద టక్ జగదీష్ ఫెస్టివల్ మూడ్ లో తన ఫ్యామిలీతో కలసి పాడుకుంటున్న ఈ పాట శ్రోతలను అలరిస్తోంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో జగపతి బాబు - నాజర్ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సమ్మర్ లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది కలిసి నిర్మిస్తున్నారు.Full View
'కోలో కోలన్న కోలో.. కొమ్మలు కిలకిలా నవ్వాలి.. కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి' అంటూ సాగిన ఈ పాటకు థమన్ స్వరాలు సమకూర్చారు. దీనికి ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. కుటుంబ విలువలు.. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఆప్యాయతలు వంటి వాటిని ఇందులో ప్రస్తావించారు. ఈ గీతాన్ని అర్మాన్ మాలిక్ - హరిణి - శ్రీకృష్ణ - థమన్ కలిసి ఆలపించారు. మొత్తం మీద టక్ జగదీష్ ఫెస్టివల్ మూడ్ లో తన ఫ్యామిలీతో కలసి పాడుకుంటున్న ఈ పాట శ్రోతలను అలరిస్తోంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో జగపతి బాబు - నాజర్ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సమ్మర్ లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది కలిసి నిర్మిస్తున్నారు.