ఈ బంచ్‌ కి పెద్ద పంచ్ త‌గిలింది!!

Update: 2015-12-06 09:30 GMT
క‌ల‌సి ఉంటే క‌ల‌దు సుఖం అన్నారు పెద్ద‌లు. కానీ ఈ సూత్రాన్ని ప‌క్క‌న పెట్టేసినందుకు ఎన్ని ప‌రిణామాలో టాలీవుడ్‌ లో. ఏకంగా ఓ బంచ్ బంచ్ డిజాస్ట‌ర్ల‌తో కొట్టుకుపోయే ప‌రిస్థితే త‌లెత్తింది. టాలీవుడ్‌ లో ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ గా పేరు తెచ్చుకున్న శ్రీ‌నువైట్ల‌ - స్టార్ రైట‌ర్‌ గా పేరున్న కోన వెంక‌ట్ అండ్ గోపిమోహ‌న్‌ - వీళ్ల‌తోపాటే చ‌క్క‌ని విల‌క్ష‌ణ‌మైన క్యారెక్ట‌ర్ల‌లో రాణించిన ప్ర‌కాష్ రాజ్.. వీళ్లంద‌రికీ గంప‌గుత్త‌గా వ‌రుస ఫ్లాప్‌ లు ఎదుర‌వ్వ‌డం వెన‌క ఒకే ఒక్క బ‌ల‌మైన పంచ్ ఉంద‌ని ఇట్టే అర్థ‌మైపోతోంది.

వీళ్లెవ‌రూ క‌లిసి లేరిప్పుడు. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా ఉన్నారు. దాని ప‌ర్య‌వ‌సానం ఎవ‌రికీ హిట్లు లేవిప్పుడు. ఇంకాస్త డీటెయిల్డ్‌ గా మాట్లాడుకుంటే..  కోన నుంచి శీను విడిపోయాక ఆగ‌డు వంటి భారీ ప్రాజెక్టు డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ ఒక్క సినిమాతో శ్రీ‌నువైట్ల గ్రాఫ్ ఒక్క‌సారిగా ప‌త‌న‌మైంది. బ్రూస్‌ లీ ప‌రాజ‌యంతో అది ప‌రిస‌మాప్తం. ఇప్పుడు చిన్నా చిత‌కా హీరోలు అవ‌కాశాలిచ్చినా పెద్ద బ్లాక్‌ బ‌స్ట‌ర్ అసాధ్యం. ఇక శ్రీ‌ను నుంచి విడిపోయినందుకు కోన ఏమైనా టాప్ రేంజులో ఉన్నాడా? అంటే అదీ లేదు. మ‌ధ్య‌లో గీతాంజ‌లి సినిమా నిర్మించి హిట్టందుకున్నాడు కానీ నిర్మాత‌గా - ర‌చ‌యిత‌గా శంక‌రాభ‌ర‌ణం లాంటి అట్ట‌ర్‌ ఫ్లాప్ తీశాడు. ఇటీవ‌లి కాలంలో రైట‌ర్‌ గా ప‌నిచేసిన బ్రూస్‌ లీ - అఖిల్ ఘోర‌మైన డిజాస్ట‌ర్లు.

ఇక‌పోతే కోన వెంటే ఉండే గోపిమోహ‌న్ త‌న‌కంటూ ఇండివిడ్యువాలిటీని ఆపాదించుకోలేక‌పోతున్నాడు. ద‌ర్శ‌కుడిగా నిరూపించుకోవాల‌న్న క‌ల క‌ల‌లానే ఉంది. కోన‌తో పాటే ర‌చ‌యిత‌గా ప‌రాజ‌యాల్లో భాగస్వామి అయ్యాడు.  వీళ్లంద‌రి అండ‌తో టాప్ పొజిష‌న్‌ లో కొన‌సాగిన ప్ర‌కాష్‌రాజ్‌కి ఇటీవ‌లి కాలంలో అన్నీ ప‌రాభ‌వాలే. అత‌డికి స‌రైన క్యారెక్ట‌ర్లేవీ త‌గ‌ల్లేదు. టెంప‌ర్‌ - స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి - రుద్ర‌మ‌దేవి - చీక‌టిరాజ్యం వంటి విల‌క్ష‌ణ‌మైన సినిమాల్లో క‌నిపించినా అత‌డి క్యారెక్ట‌ర్లు చ‌ప్ప‌గానే ఉన్నాయ్ మ‌రి. ఇలా ఏ కోణంలో చూసినా ఈ బంచ్‌ కి పెద్ద పంచ్ త‌గిలింది మ‌రి!
Tags:    

Similar News