టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ రైటర్ గా కోనవెంకట్ పేరు మారుమోగిపోతోంది. శంకరాభరణంతో నిర్మాతగా మారడమే కాదు.. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసేస్తున్నాడు. ప్రొడక్షన్ తనకు కొత్తేం కాదనీ.. 20ఏళ్ల క్రితమే నిర్మాతగా తోకలేనపిట్ట తీశానని చెప్పిన కోన.. త్వరలో తన సొంత కథకే సినిమాటిక్ ట్విస్టులు జోడించి డైరెక్టర్గా మారతానని అంటున్నాడు.
శ్రీనువైట్లతో ఉన్న విబేధాలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన కోన.. డైరెక్టర్ సినిమాకి కెప్టెన్ అని అంగీకరించాడు. ఓ మూవీ సక్సెస్ అవడం అంటే అది కేవలం డైరెక్టర్ ట్యాలెంట్ మాత్రమే అంటే ఒప్పుకోనని కుండబద్దలు కొట్టేశాడు. బ్రూస్ లీ సినిమా యావరేజ్ అని యాక్సెప్ట్ చేస్తూనే.. కంటెంట్ ని కరెక్ట్ గా వాడుకోలేదని చెప్పాడు.
టోటల్ గా మూవీనో, ఛాన్సులనో కబ్జా చేసేయాలంటే.. అంత ట్యాలెంట్ ఉండాలి కదా అన్నది ఈయన వాదన. ఇండస్ట్రీలో ట్యాలెంట్ దొంగలు ఉన్నారన్న మాటలను అంగీకరించాడు కోన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నానని చెప్పాడు కూడా. స్టోరీ ఎప్పుడు చెబితే అప్పుడు వింటానని పవన్ అంటే.. ఎప్పుడు వింటే అప్పుడు చెబ్తానని కోన అన్నారట. అంటే కంటెంట్ రెడీగా ఉందని చెప్పేశాడు కోన.
అయితే.. కోనకు వచ్చిన పేరులో ఈయన పార్ట్నర్ గోపీ మోహన్ కి అంత పేరు రాకపోవడానికి కారణం కూడా కోన వెంకట్ చెప్పడం విశేషం. ఇద్దరు ఈక్వల్స్ కి పెళ్లి జరగదని.. ఎవరో ఎంతో కొంత తక్కువ అవుతారని వివరించాడు. అయితే..రెమ్యూనరేషన్ మాత్రం సమానంగా తీసుకుంటామని చెప్పడం విశేషం.