ఆ రిలేషన్‌ కు ఎక్స్ పైరీ దగ్గరపడింది

Update: 2015-11-01 11:30 GMT
శ్రీను వైట్ల- కోన వెంకట్ సూపర్ సక్సెస్ జోడీ.  డైరెక్టర్ కం రైటర్ గా అద్భుతాలనే సృష్టించారు వీరిద్దరూ. అయితే.. బాద్ షా తర్వాత వీరి బంధం రోడ్డెక్కడంతో.. ఎవరికి వారే అయిపోయారు. మళ్లీ రామ్ చరణ్ సయోధ్య చేయడంతో బ్రూస్ లీ కోసం వైట్ల-కోనలు కలిసి పనిచేశారు.

బ్రూస్ లీ రిజల్ట్ తేడా కొట్టడంతో.. ఇద్దరికీ మళ్లీ విబేధాలు వచ్చేశాయనే టాక్ స్ప్రెడ్ అయింది. దీన్ని ఇప్పటివరకూ ఎవరూ ఖండించలేదు, కామెంట్ చేయలేదు. అయితే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కోన ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. మళ్లీ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారా.. ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుందా అనే ప్రశ్నకు..  తమ అనుబంధానికి ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడిందంటూ.. ఇన్ డైరెక్టుగానే మనసులో మాట చెప్పాడు కోన.

నిజానికి బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ లోనే వుయ్ హేట్ వైట్ల అని, సెన్సేషన్ సృష్టించాడీ స్టార్ రైటర్. కాకపోతే తమ స్టోరీలను పర్ఫెక్ట్ గా తెరకెక్కించగల డైరెక్టర్ అంటూ కవర్ చేశాడు. ఇప్పుడా సినిమా ఫలితం తేడా వచ్చింది. కోన ఉద్దేశ్యం ప్రకారం యావరేజ్ గా మిగిలింది. దానిపై బ్లేమ్ గేమ్ కంటిన్యూ అవుతోంది. సో.. ఇకపై వీరిద్దరూ కలిసి పనిచేయడం కష్టమే అని అర్ధమవుతోంది. ఎందుకంటే.. ఎక్స్ పైరీ డేట్ అయిపోతే వాటిని పక్కన పెట్టాలి కదా.
Tags:    

Similar News