బ్రూస్ లీ సినిమా నష్టాలను పూడ్చాలి అంటూ కొందరు పంపిణీదారులు రచ్చ చేస్తున్నారనే రూమర్లు ఇప్పటికే ఫిలిం ఇండస్ర్టీ అంతా భారీగా పాకేశాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పటికే 30% లాస్ వస్తుందంటే ఏ పంపిణీదారులూ కూడా ఇలా వెనక్కి ఇవ్వమని అడిగే అవకాశం లేదని.. ఎవరైనా కూడా ఆ లాస్ కు ప్రిపేర్డుగానే ఉంటారని పెద్దలు చెబుతున్నారు. ఈ సమయంలో బ్రూస్ లీ టీం ఏమైనా క్లారిటీ ఇస్తుందా అని వెయిట్ చేస్తుంటే.. అదిగో కోన వారు స్పందించారు.
''బ్రూస్ లీ గురించి ఎలాంటి రూమర్లనూ నమ్మకండి. ధియేటర్లలో మాంచి కలెక్షన్లతో మూవీ ఇంకా రన్ అవుతోంది. ఇంకా మాంచి రెస్పాన్సే వస్తోంది'' అంటూ కోన వెంకట్ పిలిచి మరీ ఓ మాటనేశాడు. అంటే బ్రూస్ లీ విషయంలో పంచాయితీలు జరగడం అనేది వట్టిమాటే. అయినా ఇలా ప్రతీ సినిమాకూ వచ్చిన లాస్ అంతా పూడ్చమని అంటే.. అది వ్యాపారం ఎలా అవుతుంది అని అడుగుతున్నారు బడా నిర్మాతలు. మరి కోన చెప్పింది ఎంతవరకు నిజం అని చూసుకుంటే.. ''యు ఆర్ 100% రైట్ కోన'' అంటూ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూస్ బండ్ల గణేష్ సెలవిస్తున్నాడు.
ఈ విషయంపై స్పందించమని బ్రూస్ లీ నిర్మాతను అడిగితే.. గాసిప్పులపై స్పందించేంత టైమ్ లేదు అంటూ తీసిపాడేశారని మీడియాలో ఓ టాక్ నడుస్తోంది.