మారుతున్న కాలాన్ని బట్టి సినిమాలు మారుతున్నాయి. వాటిని నిర్మించే సంస్థలు కొత్త అడుగులు వేస్తున్నాయి. గతంతో పోలిస్తే టాలీవుడ్ సినిమాలకు దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరగడంతో అందుకు తగ్గట్టుగా సినిమాల నిర్మాణం మొదలైంది. కేవలం సినిమాలే కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ ల కోసం వెబ్ సిరీస్ ల నిర్మాణం కూడా మన దగ్గర ఊపందుకుంది. దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాకు పెరిగిన క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి మన వాళ్లు అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తూనే వున్నారు.
హీరోలు, దర్శకులు, నిర్మాణ సంస్థలు ఇందు కోసం కొత్త దారుల్ని అన్వేషిస్తూనే వున్నారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆదరణ పెరగడంతో భారీ నిర్మాణ సంస్థలు కూడా చిన్న చిత్రాల నిర్మాణానికి ముందుకొస్తున్నాయి. అంతే కాకుండా సహ భాగస్వామిగా వుండటానికి, డబ్బు పెట్టడానికి రెడీ అయిపోతున్నాయి. ఎక్జాంపుల్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ నచ్చడంతో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ `డీజే టిల్లు` సినిమాని నిర్మించడాన్ని చెప్పుకోవచ్చు.
ఇదే తరహాలో భారీ నిర్మాణ సంస్థగా పేరున్న కొణిదెల ప్రొడక్షన్స్ కంపనీ చిన్న చిత్రాలపై పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది. `ఖైదీ నెం.150`తో తొలి సారి నిర్మాణ రంగంలోకి ఎంటరైన ఈ మెగా కంపనీ బాధ్యతల్ని స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చూసుకుంటున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా చిన్న చిత్రాలని ఎంకరేజ్ చేస్తానని, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలని నిర్మిస్తానని చెబుతూ వస్తున్న రామ్ చరణ్ ఆ వైపు అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే ఆయన సోదరి సుశ్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై `షూటౌట్ ఎట్ ఆలేర్` వెబ్ సిరీస్‌ని, రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో `సేనాపతి` చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. సోదరి సుశ్మిత ఇప్పటికే చిన్న చిత్రాలని నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ గా పయనిస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ తను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ కంపనీ పై చిన్న చిత్రాలని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. మారుతున్న అవకాశాల్ని అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఈ కొత్త అడుగులు వేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇప్పటికే చాలా మంది యువ దర్శకుల కథలని కొణిదెల ప్రొడక్షన్స్ టీమ్ వినడం మొదలుపెట్టిందని, త్వరలోనే అందులో గుడ్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసి నిర్మాణం చేపట్టడానికి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఓ చిన్న సినిమాకు సంబంధించిన అప్ డేట్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపనీ నుంచి రానుందని చెబుతున్నారు.