ఈ మధ్య భారీ అంచనాల మధ్య విడుదలై బాక్లాఫీస్ వద్ద ఏ ప్రాజెక్ట్ బోల్తా కొట్టినా ఫస్ట్ టార్గెట్ డైరెక్టర్ అవుతున్నాడు. హీరో, ప్రొడ్యూసర్ అంతా తనే చేశాడంటూ డైరెక్టర్ ని కార్నర్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.
రీసెంట్ గా విడుదలైన 'ఆచార్య' మూవీ విషయంలోనూ ఇదే జరుగుతోందా? అనే అనేమానాలు వ్యక్తమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే థియేటర్లలోకి విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని షాకిచ్చింది.
ఊహించని ఫలితాన్ని అందించడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా షాక్ కు గురైనట్టుగా ఆయన మాటలని బట్టి తెలిపోయింది. సినిమా రిలీజ్ తరువాత కొన్ని వేదికల్లో దర్శకులపై చిరు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కొంత మంది దర్శకులు పక్కా స్క్రిప్ట్ తో రావడం లేదని సెట్ లోనే సీన్ లు, డైలాగ్ లు రాస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇటీవల 'గాడ్ ఫాదర్' ప్రమోషన్స్ లో పాల్గొన్న చిరంజీవి ఈ సారి నేరుగా కొరటాలపై కామెంట్ లు చేయడం చర్చనీయాంశంగా మారింది.
'ఆచార్య' ఫ్లాప్ గురించి ప్రశ్నించినప్పుడు దర్శకుడు కొరటాల శివ ఏం చెప్పారో అదే చేశామని చెప్పడం అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. ఇండైరెక్ట్ గా కొరటాల వల్లే 'ఆచార్య' డిజాస్టర్ అయిందని చెప్పుకుంటూ వచ్చిన చిరంజీవి తాజాగా అతని వల్లే సినిమా పోయిందనే అర్థంలో తను చెప్పిందే చేశామనడం మరింత చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ వెర్షన్ ఏంటీ? ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు?
అనే చర్చ మొదలైంది. 'ఆచార్య' వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఏర్పడిన నష్టాలని కొరటాల శివ సెటిల్ చేస్తూ వస్తున్నారు. ఇంకొంత మందికి సెటిల్ చేయాల్సి వుందట. అయితే ఇలాంటి సమయంలో మెగాస్టార్ దర్శకుడు కొరటాల శివ చెప్పిందే చేశామని తనపైకి పూర్తిగా నెట్టేసిన నేపథ్యంలో కొరటాల శివ ఇప్పటికైనా మౌనం వీడి జరిగింది ఏంటో బయటపెట్టాల్సిందే అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి కొరటాల 'ఆచార్య' విషయంలో అసలు జరిగింది ఏంటో బయటపెడతారా? లేక ఎప్పటిలాగే సైలెంట్ గానే వుంటారా? అన్నది వేచి చూడాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.