ఆల్రెడీ ‘మనమంతా’ సినిమాలో తన ఒరిజినల్ వాయిసే వినిపించాడు మోహన్ లాల్. పట్టుబట్టి తెలుగు నేర్చుకుని ఆ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. సినిమా ఆరంభంలో ఆయన వాయిస్ కొంచెం ఇబ్బందిగా అనిపించినా.. తర్వాత ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. ఐతే జనతా గ్యారేజ్ లో మాత్రం లాల్ సొంత వాయిస్ వినిపించబోదు. ఆయనకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించాడు కొరటాల. ఐతే ఈ విషయంలో తాము పట్టుబట్టలేదని.. లాల్ నిర్ణయం ప్రకారమే డబ్బింగ్ కు వెళ్లామని అంటున్నాడు కొరటాల.
‘‘మోహన్ లాల్ గారికి డబ్బింగ్ చెప్పించే విషయంలో క్లాషెస్ ఏమీ లేవు. ఆయన పాత్రకు మరొకరితో డబ్బింగ్ చెప్పించాలన్నది పూర్తిగా ఆయన నిర్ణయమే. మోహన్ లాల్ గారి వాయిస్ ముద్ద ముద్దగా ఉంటుంది. సినిమాలో సింక్ అయ్యేలా కనిపించలేదు. ఎంతకాదన్నా… ఆయనకు తెలుగు స్పష్టంగా రాదు. బలవంతంగా మాట్లాడినట్టే ఉంటుంది. థియేటర్లో ప్రేక్షకులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోనే మరొకరితో డబ్బింగ్ చెప్పించాం. ఈ విషయంలో వివాదం ఏమీ లేదు’’ అని కొరటాల అన్నాడు.
‘జనతా గ్యారేజ్’ కథ ఎన్టీఆర్ ను ఉద్దేశించి రాసిందే అని.. ఐతే కథ రాశాక ఇందులోని మరో కీలక పాత్రకు మోహన్ లాలే సరైన ఛాయిస్ అనిపించిందని.. ‘రభస’ టైంలోనే ఈ కథ ఎన్టీఆర్ కు చెప్పినా.. ఇన్నాళ్లకు తెరపైకి వచ్చిందని కొరటాల చెప్పాడు.