అఫిషియల్‌.. నిర్మాతగా కొరటాల శివ మొదటి సినిమా ఇదే

Update: 2021-07-04 07:32 GMT
టాలీవుడ్‌ కు చెందిన ఎంతో మంది దర్శకులు మరియు హీరోలు నిర్మాతలుగా మారారు. తమ బ్రాండ్‌ వ్యాల్యూతో చిన్న సినిమాలకు పెద్ద ప్రమోషన్‌ ను కలిగించి సక్సెస్ లు దక్కించుకున్న హీరోలు మరియు దర్శకులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా నిర్మాతగా సక్సెస్ అయిన దర్శకుల్లో సుకుమార్‌ ఒకరు. ఆయన తన సుకుమార్‌ రైటింగ్స్ బ్యానర్‌ లో ఇప్పటికే పలు సినిమాలను సమర్పించాడు. సినిమాల నిర్మాణం వ్యవహారంలోనే కాకుండా ఆ సినిమాల స్క్రిప్ట్‌ విషయంలో కూడా సుకుమార్‌ భాగస్వామ్యం ఉంటుందనే టాక్ ఉంది. ఇక ఆయన తర్వాత పలువురు దర్శకులు నిర్మాతలుగా మారారు. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కూడా నిర్మాతగా మారాడు. ఈయన సమర్పణలో మొదటి సినిమా షురూ అవ్వబోతుంది.

కొరటాల శివ చాలా కాలంగా నిర్మాతగా మారబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు కొరటాల శివ నిర్మాణంలో సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. విలక్షణ హీరోగా పేరు దక్కించుకున్న సత్యదేవ్‌ హీరోగా వివి గోపాల కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది. విజయవాడ బ్యాక్‌ డ్రాప్ కథతో రూపొందబోతున్న ఈ సినిమా లో సత్యదేవ్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. కథ నచ్చడంతో ఈ సినిమాను నిర్మించేందుకు కొరటాల ముందుకు వచ్చాడని అంటున్నారు. సత్యదేవ్‌ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు.

టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకు పోతున్న కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా ను చేస్తున్నాడు. చిరంజీవి తో చేస్తున్న ఆచార్య సినిమా కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఆచార్య తర్వాత ఎన్టీఆర్‌ 30 సినిమాను కొరటాల శివ చేయబోతున్నాడు.

ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌.. రామ్ చరణ్‌ వంటి స్టార్స్ తో కూడా కొరటాల శివ సినిమాలు ఉన్నాయి. ఇంత బిజీలో కూడా నిర్మాతగా కొరటాల శివ మారేందుకు సిద్దం అయ్యాడు. తనకు ఉన్న బ్రాండ్‌ తో తాను సమర్పించబోతున్న చిన్న సినిమాలకు పెద్ద బజ్ క్రియేట్‌ చేయడంలో ఈయన సఫలం అవుతాడని అభిమానులు నమ్మకం వ్యక్తం  చేస్తున్నారు. కొరటాల కొత్త ప్రాజెక్ట్‌ కు అభిమానుల తరపున ఆల్ ది బెస్ట్‌.
Tags:    

Similar News