అసలు 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా అక్కడ మోహన్ లాల్ కాకుండా బాబాయ్ బాలకృష్ణతో ఆ పాత్రను వేయించుంటే ఎలా ఉండేది? ఇప్పుడు చాలామందికి సోషల్ మీడియాలో ఇలాంటి సందేహం ఒకటి వచ్చే ఉంటుంది. రియాల్టీలో ఈ ఐడియా తాలూకు ఫీజిబిలిటీ ఎలా ఉన్నా కూడా.. అసలు ఒకసారి ఈ పాత్రకు బాలయ్యను ఊహించుకోండి అని దర్శకుడు కొరటాల శివకు చెబితే.. ఆయన ఇచ్చిన ఎక్సప్లెనేషన్ మాత్రం మైండ్ బ్లోయింగ్.
''మోహన్ లాల్ ప్లేసులో బాలకృష్ణ తీసుకోవాలంటే ఈ కథ సరిపోదు. దానికి ఇంకా పెద్ద కథ కావాలి. ఈ కథకు ఎన్టీఆర్ తో పాటు మోహన్ లాల్ ఉంటే జనాలు సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు. అదే బాలకృష్ణ-ఎన్టీఆర్ వంటి పవర్ ఫుల్ కాంబినేషన్ అయితే అప్పుడు అందరూ పర్సనల్ లెవెల్లో ఆలోచించడం మొదలెడతారు. కాబట్టి కథను పట్టించుకోరు'' అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ఇక మోహన్ లాల్ ను కేవలం 4 కోట్ల లోపు ఉండే మలయాళం మార్కెట్ కోసం తీసుకున్నాం అనడం కామెడీగా ఉందంటున్నాడు కూడా. కేవలం పాత్ర కోసమే తీసుకున్నాడట.
అసలు మార్నింగ్ షో డివైడ్ టాక్ రావడానికి కారణం ఏంటో వివరిస్తూ కొరటాల ఏమన్నాడంటే.. ''ఎన్టీఆర్ అంటే ఓపెనింగ్ ఇంట్రొడక్షన్ ఫైట్.. నాలుగైదు మాస్ డైలాగులూ పంచులూ.. భారీ డ్యాన్స్ ఫైట్.. ఇవి ఊహించారు అభిమానులు. కాని ధియేటర్లలోకి పొద్దున్నే ఫ్యాన్స్ వెళ్ళినప్పుడు.. తెల్లారి మూడు గంటలకు ఉండే స్టేట్ ఆఫ్ మైండ్ వేరు. అందుకే వాళ్ళ ఎక్సపెక్టేషన్లకు సినిమా అందలేదు. కాని 3 గంటల షో కు వచ్చిన రివ్యూలు నేను పట్టించుకోను. 8.45 నిమిషాలకు పడే షో నుండి మాత్రమే నేను పట్టించుకుంటాను'' అని సెలవిచ్చాడు.