కొర‌టాల సూప‌ర్‌ స్టార్‌ కి నో చెప్పేశాడ‌ట‌

Update: 2016-07-28 09:28 GMT
మ‌ల‌యాళ సూప‌ర్‌ స్టార్ మోహ‌న్‌ లాల్ న‌ట‌న‌లో  మిస్ట‌ర్ ప‌ర్‌ ఫెక్ట్. జాతీయ‌స్థాయి న‌టుడన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోతుంటాడు. పాత్ర‌కి స‌హ‌జ‌త్వం తీసుకొచ్చేవ‌ర‌కు రాజీప‌డ‌డు. అందుకోసం ఎంత క‌ష్ట‌ప‌డటానికైనా సిద్ధ‌ప‌డ‌తాడు. ఇటీవ‌ల తెలుగులో మ‌న‌మంతా - జ‌న‌తాగ్యారేజ్‌ లాంటి మంచి క‌థ‌లు త‌న ద‌గ్గరికి రాగానే పొంగిపోయాడు. ఇలాంటి పాత్ర‌ల్ని పోషించాలంటే ముందు భాష నేర్చుకోవ‌ల్సిందే అని ప‌ల‌కా బ‌ల‌పం చేత‌ప‌ట్టాడు. తెలుగు పుస్త‌కాలు ముందేసుకొని క‌స‌ర‌త్తులు చేశాడు. ఇప్ప‌టికే కొద్దివ‌ర‌కు తెలుగు చ‌ద‌వ‌డం - మాట్లాడ‌టం నేర్చుకొన్నాడు. ఆయ‌న చిత్త‌శుద్ధిని చూసి ప‌రిశ్ర‌మ అంతా అవాక్క‌యింది. ఆయ‌న క‌ష్టాన్ని చూసి  మ‌నమంతా టీమ్ సొంతంగా డ‌బ్బింగ్ కూడా చెప్పించింది.

అయితే ఆయ‌న డ‌బ్బింగ్‌ ని టీజ‌ర్‌ ల‌లోనూ - ట్రైల‌ర్ల‌లోనూ విని అంతా పెద‌వి విరుస్తున్నారు. డ‌బ్బింగ్‌ లో స్ప‌ష్ట‌త లేద‌నీ, తెలుగు మాట‌ల్ని మ‌ల‌యాళం యాస‌లో మాట్లాడేస‌రికి ఆయ‌న తెలుగు మాట్లాడుతున్న‌ట్టే లేద‌న్న అభిప్రాయాలు వినిపించాయి. మ‌న‌మంతా టీమ్ మాత్రం సినిమాలో అంతా క్లారిటీగానే ఉంటుంద‌ని చెబుతోంది. జ‌న‌తా గ్యారేజ్ టీమ్ మాత్రం రిస్కు తీసుకోవ‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు. మోహ‌న్‌ లాల్ పాత్ర‌కి ఆయ‌న‌తో కాకుండా వేరొక‌రితో డ‌బ్బింగ్ చెప్పించాల‌ని డిసైడ్ అయింది. జ‌న‌తా గ్యారేజ్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా మొద‌ట మోహ‌న్‌ లాల్ ప్ర‌య‌త్నం చూసి ఆయ‌న‌తోనే డ‌బ్బింగ్ చెప్పించాల‌నుకొన్నాడు. కానీ మ‌నమంతా ట్రైల‌ర్‌ లో మోహ‌న్‌ లాల్ మాట‌ల్ని - ఆ ట్రైల‌ర్‌ కి వ‌చ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ని విని త‌న నిర్ణ‌యం మార్చుకొన్నాడు. మొహ‌మాటం లేకుండా  మోహ‌న్‌ లాల్‌ కి నో చెప్పేశాడ‌ట‌. సినిమాలో ఆయ‌న పాత్ర‌కి చాలా ప్రాధాన్య‌ముంటుంద‌ట‌. అలాంట‌ప్పుడు డ‌బ్బింగ్ ఆక‌ట్టుకొనేలా లేక‌పోతే ప‌డిన క‌ష్ట‌మంతా వృథా అవుతుంద‌నే భావ‌న‌లో కొర‌టాల ఉన్నాడ‌ట‌. అందుకే మోహ‌న్‌ లాల్ ఏమ‌నుకొన్నా ఫ‌ర్వాలేదు కానీ వేరొక‌రితోనే డ‌బ్బింగ్ చెప్పించాల‌ని శివ డిసైడైన‌ట్టు తెలిసింది.
Tags:    

Similar News