నవలా రచయిత శరత్ చంద్ర.. ఇప్పటికే కోర్టులో కేసు వేయడంతో.. ఏకంగా ''శ్రీమంతుడు'' హీరో మహేష్ కు.. దర్శకుడు కొరటాల శివకు.. కోర్టు వారు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ''చచ్చేంత ప్రేమ'' అనే తన నవలను కాపీ కొట్టేసి శ్రీమంతుడు సినిమాను తీశారని.. అందుకు తనకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు క్రెడిట్ ను కూడా ఇవ్వాలని శరత్ చంద్ర డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ విషయంపై స్పందించిన కొరటాల శివ.. ఒక మంచి మాట చెప్పాడు.. ''విషయం కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి నేను మాట్లాడితే కోర్టు దిక్కారణ నేరం అవుతుంది. కాకపోతే నేను కూడా ఒక రైటర్ నే.. ఇంకో రైటర్ వర్కును ఎలా కాపీ కొట్టేస్తాను? సరే.. కోర్టును తేల్చనివ్వండి. అన్నీ అక్కడే తెలుస్తాయి'' అని అన్నాడు. దీని బట్టి చూస్తే.. తనపై వచ్చిన సదరు కాపీ కొట్టుడు దూషణలను తిప్పికొడుతున్నట్లేగా. ఇప్పటికే శరత్ చంద్ర మాత్రం రచయితల సంఘం కూడా తన కంప్లయింట్ కరక్టే అంటున్నట్లు సన్నిహితులతో చెబుతున్నారట కాని.. నిజానికి ఆ నవల్లో అసలు ''దత్తత'' అనే మాటే లేదట. రచయితల సంఘం వారు కూడా ఇంకా ఆ నవలను చదివే పనిలోనే ఉన్నారట.
ఇదే విషయమై పరచూరి గోపాలకృష్ణను సంప్రదిస్తే.. మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి.. ఐ వోంట్ టాక్ అనేశారు. చూద్దాం మరి కోర్టు వారు ఏం తేలుస్తారో!!