ఇప్పుడెందుకు రివీల్ చేశావ్‌??

Update: 2016-09-06 22:30 GMT
సడన్ గా ఒక మాటను చెప్పేశాడు దర్శకుడు కొరటాల శివ. గతంలో మనోడు మిర్చి సినిమా రిలీజైనప్పుడు.. కొంతమంది దర్శకులు తనకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వకపోవడం వలనే రైటర్ నుండి ఇలా దర్శకుడిగా మారాల్సి వచ్చిందని కొరటాల సెలవిచ్చాడు. అప్పట్లో ఆ దర్శకుడు ఎవరై ఉంటారు అంటూ చాలామంది చాలా పేర్లే చెప్పారులే. అయితే అలాంటి డైరక్టర్లలో ఒక పేరును కొరటాల మొన్న జరిగిన ఇంటర్యూలో రివీల్ చేసేశాడు.

అప్పట్లో 'సింహా' సినిమాకు కథ అండ్ మాటలు నేనే రాశాను. అయితే బోయపాటి మాత్రం కావాలంటే 'మాటలు' క్రెడిట్ తీస్కో లేదంటే 'కథ' క్రెడిట్ తీస్కో అన్నాడట. అలాగైతే రెండూ వద్దు నాకు అంటూ వర్కును బోయపాటి చేతిలో పెట్టేసి కొరటాల బయటకొచ్చేశాడట. బాగానే ఉంది. అయితే ఇప్పుడు మూడు హిట్లు కొట్టిన తరువాత కొరటాల ఇలా బోయాపాటిని ఎందుకు ఎక్స్ పోజ్ చేసేశాడు అనే సందేహం అందరికీ వచ్చేస్తోంది. పోనివ్ బోయపాటి చేస్తే చేశాడులే ఇప్పుడు అతని పేరు రివీల్ చేయకుండా ఉంటే బాగుండేది అని ఫిలిం ఇండస్ర్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇకపోతే ఈ ఎక్స్ ప్లాయిటేషన్ గురించి మాట్లాడిన కొందరు సీనియర్ ఫిలిం ఇండస్ర్టీ జనాలు మాత్రం.. 'ఎవరు కాపీ కొట్టట్లేదు? ఎవరు క్రెడిట్ కొట్టేయట్లేదు? శ్రీమంతుడు కథ నాదంటూ స్వాతి పేపర్లో సీరియల్ రాసినాయన అభియోగాలు మోపలేదా? సర్కార్ సినిమా కథకు మక్కికి మక్కీ కాపీలా జనతా గ్యారేజ్ లేదా?' అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. అలా చూసుకుంటే సర్కార్ సినిమా కథ 'గాడ్‌ ఫాథర్' యాజిటీజేలే. అది సంగతి.

Full View
Tags:    

Similar News