అఖిల్ లిస్టులోకి ఇంకో స్టార్ డైరెక్టర్

Update: 2016-05-27 07:06 GMT
అక్కినేని అఖిల్ తొలి సినిమా ఓకే అవ్వడానికి ముందు ఎంత డ్రామా నడిచిందో తెలిసిన సంగతే. దాదాపు అరడజను మంది దర్శకుల పేర్లు వినిపించాయి. చివరికి కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వి.వి.వినాయక్ తో సినిమా ఓకే అయింది. ఐతే ‘అఖిల్’ మూవీ రిజల్టే తేడా కొట్టేయడంతో ఇక రెండో సినిమా విషయంలోనూ అదే తర్జన భర్జన నడుస్తోంది. ‘అఖిల్’ రిలీజై ఆరు నెలలు దాటినా అఖిల్ రెండో సినిమా సంగతేంటో తేలలేదు. ఓ దశలో వంశీ పైడిపల్లితో సినిమా కన్ఫమ్ అని వార్తలొచ్చినా.. ఇప్పుడు సీన్ మారినట్లే కనిపిస్తోంది. రోజుకో కొత్త దర్శకుడి పేరు తెరమీదికి వస్తోంది. హను రాఘవపూడితో అఖిల్ అంటూ కొన్ని రోజులు చర్చ సాగగా.. ఇప్పుడు కొరటాల శివ పేరు వినిపిస్తోంది.

ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ పనిలో తీరిక లేకుండా ఉన్న కొరటాలను అఖిల్ కోసం కమిట్ చేయించాడట నాగ్. ఒక సినిమా పూర్తయ్యాక గానీ కొరటాల ఇంకో సినిమా గురించి ఆలోచించడు. ఈ నేపథ్యంలో ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదని తెలిసిన నాగ్.. తన చిన్న కొడుకుతో సినిమా కోసం అతడితో సంప్రదింపులు జరిపాడట. కొరటాల ఓకే అంటే తాను ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓకే అంటూ డి.వి.వి.దానయ్య ముందుకొచ్చినట్లు సమాచారం. అఖిల్-వంశీ మధ్య చాలా రోజుల పాటు చర్చలు నడిచినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు. మధ్యలో మలయాళ సినిమా ‘కమ్మటిపాదం’ రీమేక్ లో అఖిల్ నటించే విషయమై డిస్కషన్ నడిచినప్పటికీ అది అంతగా వర్కవుట్ కాదని అనుకుంటున్నారట.
Tags:    

Similar News