స్టార్ డైరెక్టర్ కొరటాల శివ 'ఆచార్య'తో కెరీర్ బిగ్ ఫ్లాప్ ని సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే అపజయమెరుగని దర్శకుడిగా 'ఆచార్య' వరకు తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న కొరటాల శివ ప్రస్తుతం ఆ షాక్ నుంచి తేరుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు.
ఎన్టీఆర్ 30వ సినిమాగా తెరపైకి రానున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై దర్శకుడు కొరటాల శివ స్నేహితుడు, క్లాస్ మేట్ సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ని మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడమే కాకుండా డైలాగ్ మోషన్ పోస్టర్ ని ఐదు భాషల్లో విడుదల చేసి పాన్ ఇండియా మూవీతో రాబోతున్నామంటూ ప్రకటించింది.
ఈ మూవీకి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన డైలాగ్ మోషన్ పోస్టర్ లో అనిరుధ్ అందించిన బీజీఎమ్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి. ఇదిలా వుంటే త్వరలోనే లాంఛనంగా ప్రారంభం కానున్న ఈమూవీకి సంబంధించిన తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చి ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'ఆచార్య'తో బారీ ఫ్లాప్ ని ఎదుర్కొన్న కొరటాల శివ 'ఎన్టీఆర్ 30' ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రతీ చిన్న విషయంలోనూ ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదట. ప్రతీదీ పక్కగా వుండాలని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగానే సంగీత దర్శకుడు అనిరుధ్ కు టప్ టార్గెట్ ని సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల అనిరుధ్ 'బీస్ట్' మూవీలోని 'అరబిక్కుత్తూ..' సాంగ్ తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇంతకు మించిన ఆల్బమ్ ని తనకు అందించాలని, ప్రతీ పాట ఓ రేంజ్ లో వుండి వైరల్ కావాలని.. ఆ స్థాయిలో సంగీతం వుండేలా స్పెషల్ కేర్ తీసుకోమని అనిరుధ్ కు కొరటాల శివ టప్ టార్గెట్ ని సెట్ చేశారట. 'పుష్ప', ట్రిపుల్ ఆర్ సాంగ్స్ దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో అందిరికి తెలిసిందే.
ఎన్టీఆర్ 30 వ సినిమా సాంగ్స్ కూడా అదే స్థాయిలో దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యేలా వుండాల్సిందే అని కొరటాల శివ సంగీత దర్శకుడు అనిరుధ్ కి చెప్పేశాకరట. అంతే కాకుండా డ్యాన్స్ విషయంలోనూ, హుక్ స్టెన్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుని డ్యాన్స్ కూడా పాటల్లో ఓ రేంజ్ లో వుండాలని శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లకు దర్శకుడు కొరటాల శివ ప్రత్యేకంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ 'బీస్ట్' మూవీ కోసం కంపోజ్ చేసిన 'అరబిక్కూతు' సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికి తెలిసిందే.
అందుకే ఈ ఇద్దరు మాస్టర్లు 'ఎన్టీఆర్ 30 లోని ప్రతీ పాటని ఓ హైలైట్ గా చేయాలని కొరటాల సూచించారట. ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్స్ అన్నది తెలిసిందే. అలాంటి డాన్సర్ కి ఈ ఇద్దరు మాస్టర్లు తోడైతే సాంగ్స్ ఓ రేంజ్ లో పేలడం ఖాయం అని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.