కోట శ్రీనివాసరావు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వందల కొద్దీ అద్భుతమైన పాత్రలతో.. తన అసాధారణ నట ప్రతిభతో మెప్పించారాయన. ఆ తరం.. ఈ తరం అని తేడా లేకుండా ఎవ్వరినడిగినా ఆయన గొప్పదనం గురించి చెబుతారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులూ వచ్చాయి. ఎందరో లెజెండ్స్ ఆయన ప్రతిభను మెచ్చుకున్నారు. అలాంటి నటుడు ఒక వేదిక మీద పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడిన మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నాడట. ‘అత్తారింటికి దారేది’ సక్సెస్ మీట్లో పవన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ.. మధ్యలో తన గురించి మాట్లాడటం తనకు ఉద్వేగం కలిగించిందని కోట చెప్పారు.
‘‘అత్తారింటికి దారేది’ సినిమా సక్సెస్ ట్ హైదరాబాద్ లోని శిల్పళావేదికలో జరిగింది. దాదాపు యూనిట్ మొత్తం ఆ వేడుకకు హాజరయ్యాం. ఆ కార్యక్రమం చాలా భారీ ఎత్తున చేశారు. అభిమానులు వేలల్లో హాజరయ్యారు. ఆ వేడుకలో కల్యాణ్ గారు ఆర్టిస్టులందరి గురించి మాట్లాడి నా వరకు వచ్చే సరికి.. ‘కోట గారు పెద్ద వారు. ఆయన గురించి నేనేం చెబుతాను? ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు కానీ.. అనుభవం కానీ సరిపోవు’ అన్నాడు. ఒక వేదిక మీద నాకు కళ్లు చెమర్చడం అదే తొలిసారి అనుకుంటా. ఒక అరనిమిషం పాటు నా కళ్ల నుంచి నీళ్లు కారాయి. హాల్లో జనాలందరూ ‘పవర్ స్టార్ పవర్ స్టార్’ అని కేకలు పెడుతుంటే.. అంతటి క్రేజ్ ఉన్న నటుడు నా గురించి రెండు మాటలు చెప్పి గౌరవించడం నాకు గొప్పగానే అనిపించింది. అదే వేదిక మీద త్రివిక్రమ్ లాంటి మంచి దర్శకుడు ‘నాకు ఇష్టమైన నటుడు కోట శ్రీనివాసరావు గారు’ అనడం కూడా సంతోషాన్నిచ్చింది’’ అని కోట అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/