బన్నీ గురించి కోట కట్టేశారే

Update: 2017-03-30 07:11 GMT
అల్లు అర్జున్ లో ఎనర్జీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉంటాయో చాలాసార్లు ఆన్ స్క్రీన్ పై చూశాం. ఆఫ్ స్క్రీన్ లో బన్నీ ఎంతటి అల్లరి చేస్తుంటాడో.. స్వయంగా తన తండ్రి అల్లు అరవింద్ చెబుతున్నపుడు కూడా విన్నాం. అలాగే మెగాస్టార్ కి ఎలాంటి విలువ ఇస్తాడో.. బన్నీ మాటల్లోనే విన్నాం. ఇప్పుడు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అయితే.. అల్లు అర్జున్ గురించి.. అతని మంచితనం గురించి ఏకంగా కోట కట్టేయడం విశేషం.

'అల్లు అర్జున్ ఏం చేసినా నాకు స్పెషల్ గా అనిపిస్తుంది. ప్రతీ సినిమాకు ఎంతో సాధన చేస్తూ ఎదుగుతున్నాడు. అందుకే కుర్రకారులో అంత క్రేజ్ సంపాదించుకున్నాడు. బన్నీ నటిస్తుంటే.. అతనిలోని శక్తి సామర్ధ్యాలు నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ప్రతీ పనినీ ఎంతో జాగ్రత్తగా చేయడం తనకి అలవాటు. అల్లు రామలింగయ్య మనవడిని.. అల్లు అరవింద్ కి కొడుకుని.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిని.. బోలెడంత క్రేజ్ ఉన్న స్టార్ హీరోని.. ఇలాంటి ఫీలింగ్స్ ఏవీ లేకుండా ఉండడం బన్నీ గొప్పదనం' అన్నారు కోట శ్రీనివాసరావు.

తానేం చేసినా వారికి చెడ్డపేరు రాకూడదని భావించడంలోనే బన్నీ మంచితనం ఏంటో అర్ధమవుతుందని చెప్పిన కోట.. అల్లు అర్జున్ కారణంగా వారికి ఎప్పటికీ చెడ్డపేరు రాదని తాను నమ్మకంగా చెప్పగలనని అనడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News