'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు రాష్ట్ర స్థాయి అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న ప్రకాశ్ రాజ్ ప్యానల్ - మంచు విష్ణు ప్యానల్ పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెడుతూ విమర్శలు చేసుకుంటున్నారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న విష్ణు - ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మరో రెండు రోజుల్లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమకు నచ్చినవారికి మద్ధతు ప్రకటిస్తున్నారు.
ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ మద్దతు ఇస్తున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా ప్రకటించారు. మరోవైపు మంచు విష్ణుకు కృష్ణ - కృష్ణంరాజు - బాలకృష్ణ వంటి ప్రముఖులు సపోర్ట్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో లోకల్ - నాన్ లోకల్ అంటూ ప్రాంతీయవాదం కూడా తెర మీదకు వచ్చింది. రవిబాబు - రాజీవ్ కనకాల వంటి వారు 'మా' సంస్థకు తెలుగు వ్యక్తి అధ్యక్షుడుగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో తాజాగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కూడా మంచు విష్ణుకు మద్ధతు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ కు క్రమశిక్షణ లేదని విమర్శలు చేశారు. ''మంచు విష్ణుకి నేను మద్దతు ఇస్తాను. ‘మా’ అధ్యక్షుడిగా నిలబడడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ నటన గురించి ఏం మాట్లాడను. నేను జాతీయ స్థాయి నటుడిని.. నాకు నంది వంటి అవార్డులు వచ్చాయని నేను చెప్పుకోను. కానీ ప్రకాష్ రాజ్ గురించి ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ప్రకాష్ రాజ్ తో నేను పదిహేను సినిమాల దాకా చేశాను. అన్నీ మెయిన్ రోల్సే. అతను ఎప్పుడూ సమయానికి షూటింగ్ కి రాడు. ఆలోచించి ఓటు వేయండి. మంచు విష్ణుని గెలిపించండి'' అని కోట శ్రీనివాసరావు అన్నారు.
అయితే 'మా' ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే విధంగా మాట్లాడుతుండటంపై నాగబాబు స్పందించారు. ''ప్రకాశ్ రాజ్ తో ఎంతో ప్రేమగా మాట్లాడే కోట శ్రీనివాసరావు - బాబు మోహన్ వంటి వాళ్ళందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రకాష్ రాజ్ ఎవరని అంటున్నారు. వాళ్లకి ఇంత జెలసీనా.. ఇంత అసూయా?'' అని నాగబాబు అన్నారు. నాగబాబు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకున్నట్లు వారు అభిప్రాయపడ్డారు, ఎందుకంటే అతను టాలీవుడ్‌లో అత్యంత సీనియర్ నటులలో ఒకరైన కోటా తెలుగు సినిమాకి గర్వకారణమని.. వారిని ఉద్దేశిస్తూ అసూయ అని మాట్లాడటం కరెక్ట్ కాదని అంటున్నారు. అలానే సీనియర్ నటుడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా నాగబాబు పేరు పెట్టి పిలవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.