బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఎక్కడ? కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎక్కడ? కానీ.. ఈ రెండింటి మధ్య దూరం ఇప్పుడు తగ్గిపోయినట్లే. ఎందుకంటే.. ఇప్పటివరకూ కూకట్ పల్లి అనే ప్రాంతం ఒకటి హైదరాబాద్ లో ఉందన్న విషయం కూడా తెలీని హృతిక్.. ఇకపై ఈ పేరును తరచూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఖాయం. ఎందుకంటే.. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ లో తాజాగా ఆయనపైన కేసు ఒకటి నమోదు కావటమే.
సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో హృతిక్ చేసిన నేరం ఏమిటో తెలుసా? ఒక ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే. కల్ట్ ఫిట్ నెస్ పేరుతో ఏర్పాటు చేసిన చైన్ ఫిట్నెస్ సెంటర్ మీద తాజాగా ఆరోపణలు రావటం.. ప్రాథమిక సమాచారం ప్రకారం అది నిజమని తేలటంతో ఆయనపై కేసు కట్టినట్లుగా తెలుస్తోంది. కూకట్ పల్లి కల్ట్ ఫిట్ నెస్ సెంటర్లో తాను ఫీజు చెల్లించినప్పటికీ తనకు కేటాయించిన స్లాట్ ఇవ్వటం లేదని శశి అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశారు.
దీంతో ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక సమాచారం ప్రకారం జిమ్ సెంటర్ కు కీలకమైన వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు. తనకున్న బరువు తగ్గించటమే కాదు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన శిక్షణను కల్ట్ సెంటర్లో బుక్ చేసుకున్నాడు. అందుకు నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాడు. అయితే.. తొలుత హామీ ఇచ్చినట్లు కాకుండా ప్రస్తుతం రోజుకు 1800 మంది సభ్యులను జిమ్ లో చేరుకునేసరికి.. వారి రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో హామీ ఇచ్చిన ప్రకారం జిమ్ పరికారాలు అందుబాటులో లేకుండా పోవటంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో.. కల్ట్ యజమానులతో పాటు.. ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పైనా కేసు నమోదు చేశారు. అయితే.. కోర్టులో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.