క్రిష్ ఆమెను కంట్రోల్లో పెట్టగలడా?

Update: 2017-06-05 10:38 GMT
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. తన రెండో సినిమాతోనే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో పని చేశాడు. ఆ తర్వాత అక్షయ్ కుమార్.. నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్లను క్రిష్ డీల్ చేశాడు. ఇంకా అనుష్క.. శ్రుతి హాసన్.. శ్రియ లాంటి స్టార్ హీరోయిన్లతోనూ వర్క్ చేశాడు. కానీ ఎవ్వరితోనూ ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తినా వాటిని సమర్థంగానే డీల్ చేశాడు క్రిష్. కానీ అతడి కొత్త సినిమా ‘మణికర్ణిక’ విషయంలో మాత్రం ఇప్పటికే చాలా వివాదాలు నడుస్తున్నాయి. సినిమాకు సంబంధించిన వివాదాలన్నీ ఒకెత్తయితే.. హీరోయిన్ కంగనా చుట్టూ నెలకొన్న కాంట్రవర్శీలు మరో ఎత్తు.

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సావాసం చేసే కంగనా గురించి.. ఈ మధ్య రచయితల నుంచి క్రెడిట్ లాగేసుకుంటుందని.. దర్శకుల నుంచి స్టోరీ ఐడియాలు దొంగిలించేస్తుందని.. ఇలా సరికొత్త వివాదాలు మొదలయ్యాయి. తనకంటూ ఒక గుర్తింపు వచ్చాక కంగనా తన గురించి చాలా ఊహించుకుంటోందని.. దర్శకుల పనిలో వేలు పెట్టడం ఆమెకు అలవాటైపోయిందని విమర్శలు వస్తున్నాయి. పైగా ‘మణికర్ణిక’ కథను తన నుంచి కంగనా దొంగిలించినట్లు సీనియర్ దర్శకుడు కేతన్ మెహతా ఆరోపించడం ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలో ‘మణికర్ణిక’ విషయంలో కంగనా జోక్యం ఏ స్థాయిలో ఉంటుందో.. టైటిల్స్ లో ఆమెకు రైటింగ్ పరంగా కూడా క్రెడిట్స్ ఏమైనా ఇస్తారేమో అన్న ప్రచారాలు మొదలయ్యాయి. అసలు ఈ కాంట్రవర్శీ క్వీన్ తో క్రిష్ ఎలా డీల్ చేస్తాడో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై క్రిష్ స్పందించడం విశేషం. కంగనా కేవలం నటిగా మాత్రం ఉంటుందని నిర్మాత హామీ ఇచ్చాక తాను ఈ సినిమా చేసేందుకు అంగీకరించానని.. రైటింగ్ విషయంలో ఆమె పాత్ర ఏమీ ఉండదని అతనన్నాడు. అదలా ఉంటే.. సెట్స్ మీద కంగనా చేసే అతిని క్రిష్ ఎలా తట్టుకుంటాడో అన్న డిస్కషన్ నడుస్తోంది బాలీవుడ్లో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News