కమర్షియల్‌ ఫ్లాపులకు కంచె వేస్తాడా?

Update: 2015-09-01 18:02 GMT
రెండో ప్రపంచ యుద్ధాన్ని, ఆ టైమ్‌ లో ప్రేమకథని ఓ అందమైన దృశ్య కావ్యంలా తెరపై చూపిస్తున్నానని చెబుతున్నాడు క్రిష్‌ (రాధాకృష్ణ జాగర్లమూడి). ప్రపంచ యుద్ధాలకు సంబంధించి, దేశంలోనే మొట్టమొదటి వార్‌ ఫిలిం ఇది. ఈ సందర్భంగా క్రిష్‌ చాలా ఎక్సయిట్‌ అవుతున్నాడు.

మనసా వాచా కర్మణా ది బెస్ట్‌ ఎటెంప్ట్‌ చేస్తున్నా. దేశాల మధ్య సరిహద్దుల కోసం కంచె వేస్తున్నారు. ఫెన్సింగ్‌ లేని దేశాల్లేవ్‌. అది దేశాల మధ్యనే కాదు .. మనుషుల మధ్య, ప్రేమల్లో అన్నిటిలో కంచె అడ్డు పడుతోంది. ఆ సంగతినే వెండితెరపై చూపిస్తున్నా. ప్రపంచయుద్ధాన్ని ఇండియా కోణంలోంచి చూపిస్తున్నా. వరుణ్‌ తేజ్‌ ధూపాటి హరిబాబు అనే సైనికుడి పాత్రలో కనిపిస్తాడు. రియల్‌ సైన్యం, రియల్‌ గన్స్‌ ఉపయోగించి షూట్‌ చేశాం అని చెప్పాడు. ప్రతి ప్రేమకథ యుద్ధంతో సమానం అని  అన్నాడు.

అంతా బావుంది సరే.. కంచెతో కమర్షియల్‌ ఫ్లాపులకు కంచె వేస్తాడా? లేదా? అన్నది మాత్రం చెప్పనేలేదు. వేదం, కృష్ణం వందే జగద్గురుమ్‌ లోనూ ఇలాంటి నేచురల్‌ రియలిస్టిక్‌ ఎప్రోచ్‌ కనిపించింది. దానివల్ల కమర్షియల్‌ హిట్‌ కుదరలేదు. అయినా ఈసారి కాన్ఫిడెంటుగా ఉన్నా. హిట్‌ కొడతా అని మాత్రం చెబుతున్నాడు.. సినిమాలో కంటెంట్‌ పరంగా రియలిస్టిక్‌ ఎప్రోచ్‌ లో వెళ్లినా .. స్వాతంత్య్రానికి ముందు కాలం, వార్‌ సీన్ లు, లవ్‌ స్టోరి మ్యాజిక్‌ చేస్తాయనే చెబుతున్నాడు క్రిష్‌. మాస్‌ ని మెప్పించే మ్యాజిక్‌ ఉందంటున్నాడు. వెయిట్‌ అండ్‌ సీ.
Tags:    

Similar News