తన వందో సినిమా కోసం బాలయ్య మామూలు కష్టం పడుతున్నట్లు లేదు. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ఫస్ట్ షెడ్యూల్లో ఈ మధ్యే మొరాకోలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముందు బాలయ్య రోజుకు 10 గంటలు కష్టపడుతున్నట్లు వార్తలొచ్చాయి.. తర్వాత 12 గంటలన్నారు.. ఇప్పుడు డైరెక్టర్ క్రిష్.. బాలయ్య రోజుకు 14 గంటలు కష్టపడ్డట్లు చెబుతున్నాడు. మొరాకోలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తొలి షెడ్యూల్ పూర్తయిన నేపథ్యంలో ఆ విశేషాలతో ఆ చిత్రం టీమ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణ గారి వందో సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అనుకున్న ప్రకారం ఈ షెడ్యూల్ పూర్తవడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ లో బాలకృష్ణగారు ప్రతి రోజూ 14 గంటల పాటు పని చేశారు. ఉదయం షూటింగుకి వచ్చినప్పుడు ఎంత ఎనర్జిటిగ్గా ఉండేవాళ్లో సాయంత్రం షూటింగ్ ముగిసే సమయానికి కూడా అలాగే ఉండేవారు. ఆయన ఎనర్జీ మాకెంతో స్ఫూర్తినిచ్చింది’’ అన్నాడు.
మొరాకోలోని అద్భుతమైన లోకేషన్లలో రెండు వారాల్లోనే భారీ సన్నివేశాలు చిత్రీకరించామని.. మొరాకలో షూటింగ్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమా ఇదేనని ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ నిర్మాతలు తెలిపారు. మొరాకాలోని అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియస్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెప్పారు. ఒకటో శతాబ్దం నేపథ్యంలో బాలకృష్ణ-కబీర్ బేడి మధ్య యుద్ధ సన్నివేశాలను రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్లతో చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ షూటింగులో 1000 మంది పాల్గొన్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ కసం 200 గుర్రాలు.. ఒంటెల్ని ఉపయోగించారట.