‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆరంభమైనప్పటి నుంచి ఈ సినిమా గురించి పాజిటివ్ వార్తలే వస్తున్నాయి. కానీ ఈ వార్తలతో బోర్ కొట్టేసిందో ఏమో.. ఆ మధ్య దీని గురించి నెగెటివ్ ప్రచారం మొదలైంది. సంజయ్ లీలా బన్సాలీతో ఉన్న సాహిత్యం దృష్ట్యా ఆయన తీసిన హిందీ సినిమా ‘బాజీరావు మస్తానీ’ కోసం తీసిన కొన్ని యుద్ధ సన్నివేశాల్ని.. పాటలకు సంబంధించిన విజువల్స్‌ను ‘శాతకర్ణి’ కోసం క్రిష్ వాడుకున్నట్లుగా వార్తలొచ్చాయి. దీనిపై ఆల్రెడీ ఖండన ఇచ్చాడు క్రిష్. ఇప్పుడు కొంచెం తీవ్ర స్వరంతో ఈ ఆరోపణలపై స్పందించాడు. ఇంత కష్టపడి.. ఇలాంటి భారీ సినిమా తీస్తూ.. తాను మరో సినిమాపై ఎందుకు ఆధారపడతానని క్రిష్ ప్రశ్నించాడు.
మనకు చేతకాదా.. మనం తీయలేమా.. పక్కవాళ్ల కష్టాన్ని నేనెందుకు వాడుకుంటాను.. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో నాకర్థం కాలేదు.. ఇలాంటి వార్తలు పుట్టించేటపుడు కాస్తయినా ఆలోచించరా అంటూ అసహనం వ్యక్తం చేశాడు క్రిష్. ఇక ఆడియో వేడుకలో తాను అన్న ఖబడ్దార్ అన్న మాట గురించి.. చిరంజీవి-బాలయ్య అభిమానుల మధ్య గొడవల గురించి కూడా క్రిష్ స్పందించాడు. ‘‘శాతకర్ణి ఓ తెలుగు చక్రవర్తి. అతని చరిత్ర మనకు తెలియదు. శాతకర్ణి గురించి పరాయి వాడు గొప్పగా చెప్పుకుంటుంటే మనం పట్టించుకోని దౌర్భాగ్యం మనది. ఆ ఆవేదన లోంచి ‘ఖబడ్దార్’ అనే మాట వాడితే.. దాన్ని పట్టుకుని పెడార్థాలు తీశారు. ప్రతి విషయాన్నీ నెగెటివ్‌గా చూడటం మానుకోవాలి’’ అని క్రిష్ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/