అక్కినేని ఫ్యామిలీ తరతరాలు గుర్తుంచుకునే సినిమాగా నిలిచిపోయింది ‘మనం’. ఆ సినిమా చూశాక.. తెలుగు పరిశ్రమలోని ప్రతి పెద్ద ఫ్యామిలీ కూడా మనకూ ఇలాంటి సినిమా ఒకటుంటే బావుంటుందని ఫీలై ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. దగ్గుబాటి ఫ్యామిలీ కథానాయకులు వెంకటేష్, రానా కలిసి సినిమా చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. మెగా ఫ్యామిలీనూ ఎప్పుడో ఓసారి ‘మనం’ తరహా సినిమా తెరకెక్కే అవకాశం లేకపోలేదు. ఐతే ఇప్పుడు ఆశ్చర్యకరంగా ‘ఘట్టమనేని’ ఫ్యామిలీ సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, గౌతమ్ కృష్ణ కలిసి ఓ కుటుంబ ప్రధాన చిత్రం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట.
ఓ స్టార్ డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మహేష్.. తండ్రి తో, కొడుకుతో కలిసి వేర్వేరుగా నటించాడు. బాల నటుడిగా కృష్ణ చేసిన చాలా సినిమాల్లో కనిపించిన మహేష్.. హీరో అయ్యాక కూడా ‘వంశీ’ సినిమాలో తండ్రితో నటించాడు. ఇక కొడుకు గౌతమ్‌ను ఈ మధ్యే ‘1 నేనొక్కడినే’లో నటింపజేశాడు. ఐతే తన చిన్నప్పటి రూపంలో కొడుకు కనిపించడం వల్ల ఇద్దరూ కలిసి తెరమీద కనిపించే అవకాశం లేకపోయింది. ఐతే ఇప్పుడు ఘట్టమనేని మూడు తరాల నటులూ కలిసి ఇప్పుడు తెరమీద కనిపించబోతున్నట్లు సమాచారం. ఐతే ఈ కథ విషయంలో మహేష్ చాలా పర్టికులర్ గా ఉన్నాడని.. పక్కా కథ రెడీ అయితేనే సినిమా చేస్తానని అంటున్నాడట. ప్రిన్స్ ను మెప్పించడానికి ఆ స్టార్ డైరెక్టర్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చూద్దాం ఘట్టమనేని వారి మనం ఎప్పుడు తెరపైకి వస్తుందో?