బంగారానికి పుష్కరాలు తిక్క తప్పదా?

Update: 2016-08-02 04:42 GMT
ఆగస్ట్ 12.. ఈ డేట్ బాగా బిజీ అయిపోయింది. ఆ రోజున రావాల్సిన జనతా గ్యారేజ్ వాయిదా పడ్డంతో అదే డేట్ ని హడావిడిగా ఫిక్స్ చేసేసుకుని వెంకటేష్ మూవీ బాబు బంగారం థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించేశారు. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి సాయిధరం తేజ్ సినిమా తిక్కను ఆగస్ట్ 13న అనౌన్స్ చేశారు. ఖాళీ డేట్ చూసుకుని అనౌన్స్ చేశారు బాగానే ఉంది కానీ.. అదే రోజున కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఆగస్ట్ 12 నుంచి 23 వరకూ కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. ఇందుకోసం రెండు తెలుగురాష్ట్రాల తరఫున ఏర్పాట్లు ఘనంగానే జరుగుతున్నాయి. ఏపీలో అయితే.. చాలా చోట్ల సెలవలు కూడా అనౌన్స్ చేశారు. ఇది ట్రాన్స్ పోర్ట్ పై గట్టిగానే ఎఫెక్ట్ చూపిస్తుంది. బెజవాడ లాంటి ఊళ్లలో అయితే అసలు రవాణా అనే మాట కూడా ఉండే ఛాన్స్ లేదు. 12 ఏళ్లకోసారి మాత్రమే వచ్చే పుణ్య దినాలు కావడంతో జనాలు పుష్కరాలపై పెట్టిన కాన్సంట్రేషన్ సినిమాలపై పెట్టడానికి ఛాన్స్ తక్కువ. సరిగ్గా పుష్కరాల ప్రారంభంతోనే రిలీజ్ కానున్న బాబు బంగారం.. తిక్కలపై కృష్ణా పుష్కరాలు ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది.

మరోవైపు పాజిటివ్ యాంగిల్ కూడా ఉందిలెండి. సెలవలు రావడం.. పుష్కరాలకు పక్క ఊళ్లకు వచ్చిన జనాలకు రిలాక్సేషన్ గా కూడా సినిమాలకు దారితీయచ్చు. మరి జనాల రియాక్షన్ సినిమాలకు ఫేవర్ గా ఉంటే మాత్రం ఈ రెండు మూవీస్ కి లక్కీ ఛాన్సే.
Tags:    

Similar News