అల్లూరి డైలాగ్ అల్లుడి నోట.. సూప‌ర్ స్టార్ కి న‌చ్చిందా?

Update: 2020-06-01 05:15 GMT
సూప‌ర్ స్టార్ కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ కి ప్ర‌త్యేకించి అభిమానులున్నారు. ఆయ‌న వాయిస్ లో బేస్ కి.. డైలాగ్ స్టామినాకి ఆశ్చ‌ర్య‌పోని వారు ఉండ‌రు. క్లాసిక్ డేస్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్ని అందించిన సూప‌ర్ స్టార్ త‌న డైలాగ్ ప‌వ‌ర్ తోనే స‌గం హిట్టు కొట్టేసేవారు. `అల్లూరి సీతారామ‌రాజు` లాంటి దేశ‌భ‌క్తి సినిమాలో న‌టించిన గ్రేట్ స్టార్ ఆయ‌న‌. శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు అంటే ఎన్టీఆర్ ఒక్క‌డే అని భావించే తెలుగు ప్ర‌జ‌లు మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు అంటే సూప‌ర్ స్టార్ కృష్ణ మాత్ర‌మేన‌ని అంగీక‌రిస్తారు. ఆయ‌న త‌ర్వాత ఆ పాత్ర‌కు రీప్లేస్ మెంట్ అన్న‌దే లేదు. అప్ప‌ట్లో ప‌లువురు స్టార్స్ ప్ర‌య‌త్నించినా కృష్ణ గారిలా యాప్ట్ కాలేద‌న్న విమ‌ర్శ‌లొచ్చాయి. ఇన్నాళ్టికి జ‌క్క‌న్న పుణ్య‌మా అని స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరిగా చ‌ర‌ణ్ న‌ట‌న ఎలా ఉండ‌నుందో చూడాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లో ఉంది.

అదంతా స‌రే కానీ.. అల్లూరి సీతారామ‌రాజు క్లాసిక్ చిత్రంలో క్లైమాక్స్ ని సూప‌ర్ స్టార్ అభిమానులు ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. తెల్లోడి తూటాకు ఎదురెళ్లిన విప్ల‌వ వీరుడిగా అల్లూరి ఎమోష‌న‌ల్ డైలాగ్ హృద‌యాల్ని ద్ర‌వింప‌జేస్తుంది. ఆ డైలాగ్  కృష్ణ వాయిస్ లోనే వినాలి. ఆ బేస్ లో డైలాగ్ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది. అయితే అలాంటి డైలాగ్ ని ఇమ్మిటేట్ చేయ‌బోయిన సుధీర్ ని చూయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించేదే.

సూప‌ర్ స్టార్ డైలాగ్ ని ఎత్తుకోవ‌డం అంటేనే సాహ‌సం. కానీ ఆ ప్ర‌య‌త్నం చేశాడు. అల్లూరి సీతారామ‌రాజు చిత్రంలోని క్లైమాక్స్ డైలాగ్ ని  సుధీర్ ఎలా చెప్పాడు? అన్న‌ది స్వ‌యంగా సూప‌ర్ స్టార్ వీక్షించారు. ఆ వీడియోని సుధీర్ బాబు స్వ‌యంగా మామ‌గారైన కృష్ణ‌కు చూపిస్తున్న వీడియోని ఇన్ స్టాలో షేర్ చేశారు. మామగారికి బ‌ర్త్ డే గిఫ్ట్ అంటూ సుధీర్ చ‌క్క‌ని ప్ర‌య‌త్న‌మే చేశాడు. అయితే ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? అన్న‌ది చూడాలి. ఈ వీడియోలో ఆది శేష‌గిరిరావు .. కృష్ణ కుమార్తెలు.. మ‌న‌వ‌లు ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ లోనూ వైర‌ల్ అవుతోంది.
Tags:    

Similar News