కృష్ణవంశీ చేయబోయే చిన్న సినిమా అదేనా?!

Update: 2015-06-26 03:49 GMT
ఇటీవల దర్శకులంతా చిన్న సినిమాలమీద పడ్డారు. స్టార్‌ కథానాయకులంతా రెండు మూడు చిత్రాలతో బిజీగా కనిపిస్తుండటంతో...  వాళ్లు ఖాళీ అయ్యేలోపు చిన్న హీరోలతో చిన్న సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు కొద్దిమంది పెద్ద దర్శకులు. కృష్ణవంశీ చాలా రోజులుగా ఆ సినిమా పనుల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.

        చిన్న సినిమానే అయినా, పెద్ద సంస్థలో చేయాలనేది కృష్ణవంశీ ఆలోచన. అందుకే దిల్‌రాజు, ప్రకాష్‌రాజ్‌లాంటివాళ్లతో చర్చలు జరుపుతున్నాడు. ఈ కాంబినేషన్‌లో సినిమా గురించి కొన్నాళ్లుగా జనం మాట్లాడుకొంటూనే ఉన్నారు. అయితే ఆ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతోందని తాజా సమాచారం. అందులో కథానాయకుడిగా సందీప్‌కిషన్‌ నటించొచ్చని ప్రచారం సాగుతోంది.

          కొన్నాళ్లుగా సందీప్‌ సినిమా వ్యవహారాలన్నీ ఆయన మామ, ప్రముఖ కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడు చూసుకొంటున్నాడు. సందీప్‌ చేసే ప్రతీ సినిమా ఓ క్రేజీ కాంబినేషన్‌లో ఉండాలనేది ఛోటా ఆలోచన. అందుకే ఉషాకిరణ్‌ మూవీస్‌లాంటి పెద్ద సంస్థతోనూ 'బీరువా'లాంటి సినిమా చేయించారు ఛోటా. ఇప్పుడు కృష్ణవంశీ, దిల్‌రాజులని లైన్లో పెట్టేసి ఈ కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పించాడని ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News