ఈ శుక్రవారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకటి ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ - ఇంకోటి ‘గరం’. ఇందులో ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఏది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాని సినిమాకు మంచి క్రేజ్ ఉంది జనాల్లో. ఆ సినిమాకు సంబంధించి ప్రతి విషయం ఆసక్తి రేపుతోంది. అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి ఆ చిత్రానికి. ఐతే ‘గరం’ పరిస్థితి పూర్తి భిన్నం. ఈ సినిమా చాలా మందికి పరీక్ష లాంటిది. హీరో - డైరెక్టర్ - నిర్మాత అందరికీ చావో రేవో అన్న పరిస్థితి. హిట్టు కొట్టి తీరాల్సిన స్థితిలో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ లాంటి క్రేజున్న సినిమాకు ఎదురెళ్లడం సాహసమే అని చెప్పాలి.
ప్రేమకావాలి - లవ్లీ లాంటి సినిమాలతో ఆది కెరీర్ బాగానే ఆరంభమైనా.. ఆ తర్వాత సుకుమారుడు దగ్గర్నుంచి రఫ్ వరకూ వరుసగా ఫెయిల్యూర్లే చూశాడు సాయికుమార్ తనయుడు. మరోవైపు డైరెక్టర్ మదన్ పరిస్థితేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రవరాఖ్యుడు చేశాక దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత మెగా ఫోన్ పట్టాడు. పైగా తన శైలికి నప్పని మాస్ మసాలా సినిమాను తొలిసారి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్ర నిర్మాత మధ్యలో చేతులెత్తేస్తే అనుకోని పరిస్థితుల్లో నిర్మాతగా మారి.. కొడుకు సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టాడు సాయికుమార్. కాబట్టి ముగ్గురికీ ఈ సినిమా కీలకమే. ట్రైలర్ అదీ చూస్తే రొటీన్ మాస్ మసాలా సినిమాలా కనిపిస్తోంది ‘గరం’. ఈ తరహా సినిమాలకు ప్రేక్షకులు ఒక్కోసారి ఒక్కోలా తీర్పిస్తుంటారు. మరి ‘గరం’ ఏ కేటగిరిలో చేరుతుందో... నాని సినిమాను తట్టుకుని ఏమాత్రం నిలబడుతుందో చూడాలి.